Movies

విజయ్ మరియు బన్నీ సినిమాలు నెట్ ఫ్లిక్స్ లో కూడా అందుకేనా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమాలు “అల వైకుంఠపురములో” మరియు “వరల్డ్ ఫేమస్ లవర్” చిత్రాలు ఇటీవలే డిజిటల్ గా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ రెండు సినిమాలను ఒక కామన్ పాయింట్ ఇప్పుడు కలుపుతుంది.

నిజానికి ఈ రెండు సినిమాలు అల వైకుంఠపురములో మరియు వరల్డ్ ఫేమస్ లవర్ లు విడుదలకు ముందు అమెజాన్ ప్రైమ్ కానీ నెట్ ఫ్లిక్స్ వంటి స్ట్రీమింగ్ యాప్స్ లో అందుబాటులోకి ఉండదు అని అనౌన్స్ చేసినవే కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఈ రెండు సినిమాలు సన్ నెక్స్ట్ తో పాటు నెట్ ఫ్లిక్స్ లో కూడా దర్శనం ఇచ్చింది.

కానీ దీనికి అసలు కారణం వేరే ఉందనిపిస్తుంది. మన దేశంలో అమెజాన్ ప్రైమ్ మరియు నెట్ ఫ్లిక్స్ లు చాలా పాపులర్ అందులోనూ ముఖ్యంగా హిందీ జనంలో అయితే నెట్ ఫ్లిక్స్ బాగా పాపులర్ అందుకే ఈ ఇద్దరు ప్లాన్ మార్చారా అనిపిస్తుంది.ఎందుకంటే ఈ ఇద్దరు హీరోలు ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నారు.

ఇద్దరికీ తమ మొదటి ప్రయత్నం హిందీలో సక్సెస్ కావాలి అంటే అది అంత సింపుల్ కాదు. దానికంటూ ఒక స్పెషల్ బేస్ ఉండాలి.అందుకే వీరు ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చు.అందుకే తాము నటించిన ఈ రెండు సినిమాలు నెట్ ఫ్లిక్స్ లో కూడా విడుదల చేసి మెల్లగా ఏ క్లాస్ ఆడియెన్స్ కు కూడా దగ్గరైతే అక్కడ తమ డెబ్యూ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని ఈ ప్లాన్ వేసారేమో..?