“ఆచార్య”లో మహేష్ స్టోరీ వెనుక ఇంత స్టోరీ నడిచిందా.!
ఇప్పుడు మన టాలీవుడ్ నుంచి రాబోతున్న క్రేజీ ప్రాజెక్టులలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వరుస బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం “ఆచార్య” కూడా ఒకటి. అయితే గత నెల రోజున నుంచి ఈ సినిమా వచ్చినన్ని గాసిప్స్ మరే ఇతర సినిమాపై కూడా వచ్చి ఉండవు.
ముఖ్యంగా ఈ సినిమాలోని ఓ కీలక పాత్రకు గాను ఒక స్టార్ హీరో పేరు వినిపిస్తుంది అని వచ్చిన వార్తలు అయితే టాలీవుడ్ లో సంచలనంగా మారిపోయాయి. అందులోను ఆ పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు కనిపిస్తున్నారని వచ్చిన వార్తలు అయితే మరింత వైరల్ అయ్యాయి.
అసలు దీని వెనుక ఉన్న అసలు స్టోరీ ఏమిటా అన్నది దర్శకుడు కొరటాల శివ బయటపెట్టారు. మొదట ఈ సినిమాలోని ఈ కీలక పాత్ర కోసం చరణ్ నే అనుకున్నామని కానీ అప్పటికే చరణ్ రాజమౌళి దర్శకత్వంలో RRR లో నటిస్తున్నారని కానీ అదే సమయంలో…
ఆ చిత్రం వాయిదా పడడంతో ఆచార్య కూడా వాయిదా పడిందనే వార్తలు పుట్టుకు రావడంతో ఒక చిన్న పాటి టెన్షన్ మొదలు కాగా ఈ విషయాన్ని మహేష్ తో చర్చించగా తాను తనకి ధైర్యం ఇచ్చారని ఆ విషయమే బయటకు మహేష్ ఈ సినిమాలో చేస్తున్నారు అన్నట్టుగా వైరల్ అయ్యిపోయింది అని కొరటాల తెలిపారు. ఇది ఆచార్య సినిమాలో మహేష్ స్టోరీ వెనుక ఉన్న స్టోరీ..