లాక్‌డౌన్ తర్వాత అదిరింది ఉంటుందా? లేదా?
తెలుగు బుల్లి తెరపై గత ఏడు సంవత్సరాలుగా సెన్షేషన్ క్రియేట్ చేస్తూనే ఉన్న కామెడీ షో జబర్దస్త్.ఈ కామెడీ షోను మరే కామెడీ షో కూడా బీట్ చేయలేక పోయింది.ప్రస్తుతం జీ తెలుగులో కూడా అదిరింది అనే షోతో జబర్దస్త్‌ను బీట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.కాని అది కూడా వర్కౌట్ అవ్వడం లేదు.నాగబాబు జబర్దస్త్ నుండి బయటకు వెళ్లి అదిరిందిని మొదలు పెట్టాడు.కాని జీ తెలుగులో ప్రసారం అవుతున్న అదిరింది ఫ్లాప్ అని చెప్పక తప్పదు.
కొన్ని స్కిట్స్‌కు యూట్యూబ్‌లో మంచి వ్యూస్ వస్తున్నా కూడా జబర్దస్త్ రేంజ్‌లో మాత్రం అదిరిందిని ప్రేక్షకులు చూడటం లేదు అంటూ స్వయంగా జీ తెలుగు వారే చెబుతున్నారు.అందుకే అదిరింది షోను కంటిన్యూ చేస్తారా లేదా అనే అనుమానాలు ఉన్నారు.ఇలాంటి సమయంలో లాక్ డౌన్ రావడంతో మూడు నాలుగు వారాలు అదిరింది షో లేకుండా పోయింది.ఇదే అదునుగా అదిరింది షోను ఆపేస్తే పరువు దక్కుతుందని నాగబాబు భావిస్తున్నాడట
నిర్మాణ సంస్థ కూడా ఈ అదిరిందికి భారీగా ఖర్చు చేస్తున్నా కూడా వచ్చేవి కొన్ని డబ్బులే అవ్వడంతో చేసేది లేక ఇక షూటింగ్‌ను ఆపేయడం మంచిదనే నిర్ణయానికి వచ్చారు.యాంకర్‌ను మార్చిన కమెడియన్స్‌ను మార్చినా కూడా అదిరిందికి వస్తున్నది అంతంత మాత్రమే స్పందన.అందుకే ఈ షోను ఆపేస్తేనే ఉత్తమం అనే అభిప్రాయానికి అంతా వచ్చారట.అందుకే అదిరింది లాక్ డౌన్ తర్వాత ఉండేది అనుమానమే అంటున్నారు.