Movies

బన్నీని మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేయటానికి అసలు కారణం అదేనా…?

ప్రపంచమంతా కరోనా మహమ్మారి విజృంభణతో చాలా దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లాయి. మనదేశంలో కూడా 21రోజుల లాక్ డౌన్ ముగిసి మళ్ళీ మే3వరకూ పొడిగించారు. సెలబ్రిటీలు అందరూ కరోనాపై పోరాటంలో భాగంగా తమకు తోచిన విధంగా చేస్తున్నారు. ఇక మెగాఫ్యామిలీ కరోనా పై పోరాటంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు.. అభిమానులకు సందేశాలు ఇస్తూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కరోనా వైరస్ పై సాంగ్ లో యాక్ట్ చేయడమే కాకుండా అమితాబ్ వంటి బాలీవుడ్ యాక్టర్స్ తో కలిసి కరోనా నివారణ జాగ్రత్తలు తెలియజేసాడు. అలాగే ట్విట్టర్లో డైలీ కరోనాపై ఏదొక సందేశాన్ని ఇస్తూనే ఉన్నాడు. ఈ మధ్య మెగాస్టార్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ప్లకార్డులు ద్వారా కరోనా మెసేజ్ ఇచ్చారు.

“ఇంట్లో ఉంటాం.. యుద్ధం చేస్తాం.. క్రిమిని కాదు ప్రేమను పంచుతాం.. కాలు కదపకుండా కరోనాను తరిమేస్తాం.. భారీతీయులం ఒక్కటై భారత్ని గెలిపిస్తాం.. స్టే హోమ్.. స్టే సేఫ్” అంటూ మెగా ఫామిలీ సందేశాన్ని ఇచ్చారు. చిరంజీవితో పాటు అల్లు అరవింద్ నాగబాబు వరుణ్ తేజ్ ఉపాసన రామ్ చరణ్ , సుస్మిత, శ్రీజ కళ్యాణ్ దేవ్ సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ పాల్గొన్నారు. అంతవరకూ బానే ఉంది. కానీ ఇదే ఇప్పుడు బన్నీని మళ్ళీ టార్గెట్ చేసేలా చేసింది. ఈ ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శించిన వాళ్లలో మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు అర్జున్ లేడు. దీంతో మెగా ఫ్యాన్స్ బన్నీపై ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. కళ్యాణ్ దేవ్, వైష్ణవ్ తేజ్ కూడా పాల్గొంటే బన్నీ కి ఎందుకు పార్టిసిపేట్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు.

ఒకవేళ అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ వస్తుందా అనుకుంటే, అల్లు అరవింద్, శిరీష్ కనిపించారు. ఆ ఫ్యామిలీల మధ్య ఏమీ ఇబ్బందులు లేవని అర్థం అవుతోంది. అయితే కొంతమంది మాత్రం బన్నీ నెక్స్ట్ సినిమాలో గెట్ అప్ రివీల్ అవ్వకుండా ఉండటానికి బయటకి రాలేదేమో అని డౌట్ వ్యక్తం చేస్తున్నా, ఆల్రెడీ ‘పుష్ప’ ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా బన్నీ లుక్ బయటకి వచ్చేసింది. ఈ పోస్ట్ ని చిరు, చెర్రీ,వరుణ్ తేజ్ ఇలా అందరూ సోషల్ మీడియాలో షేర్ చేసారు. బన్నీ దాంట్లో పార్టిసిపేట్ చేయకపోయినా కనీసం ఆ పోస్ట్ షేర్ చేసుండొచ్చు కదా అనేది ఫాన్స్ ప్రశ్న. అందుకే మెగా ఫాన్స్ తాజాగా ఈ ఇన్సిడెంట్ తో బన్నీని మళ్ళీ టార్గెట్ చేసారు. వాస్తవానికి అదే మెగా ఫ్యామిలీకి చెందిన పవన్ కళ్యాణ్ కూడా ప్లకార్డుల మెసేజ్ లో పార్టిసిపేట్ చేయలేదు. కానీ, పవన్ ని వదిలేసి కేవలం బన్నీనే మెగా ఫ్యాన్స్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారో ఎవరికీ అర్ధం కాదు. దీనిపై బన్నీ క్లారిటీ ఇస్తాడా లేదా అనేది చూడాలి.