Movies

ఈ ఏడాది బిగ్‌ బాస్‌లపై క్లారిటీ ఇచ్చిన యాజమాన్యం…ఉందా…లేదా…?

తెలుగు, తమిళంలో బిగ్‌బాస్‌ ఇప్పటి వరకు మూడు సీజన్‌లు పూర్తి చేసుకుంది.రెండు భాషల్లో కూడా ఒకేసారి బిగ్‌ బాస్‌ షోలు ప్రసారం అవుతున్నాయి.కాస్త అటు ఇటుగా రెండు భాషల్లో కూడా ప్రేక్షకులను బిగ్‌బాస్‌ షో ఆధరిస్తుంది.గత మూడు సీజన్‌లను చూసినట్లయితే మార్చి ఏప్రిల్‌ నుండే ఏర్పాట్లు ప్రారంభం అయ్యేవి.కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో బిగ్‌బాస్‌ షో నిర్వహణ జరిగేలా కనిపించడం లేదు. ఈ ఏడాదిలో బిగ్‌బాస్‌ షో ఉంటుందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

ఆమద్య ఒక భాష బిగ్‌బాస్‌ షో ను మద్యలోనే అర్థాంతరంగా ఆపేశారు. కరోనా ఈ రేంజ్‌లో కరాళ నృత్యం చేస్తుండగా బిగ్‌బాస్‌ షోను నిర్వహించడం సాధ్యం కాలేదు.ఎన్నో కంపెనీలు నష్టాల్లో కూరుకు పోయే పరిస్థితి. దాంతో షోకు ఎండోర్‌ చేసేందుకు ఏ కంపెనీ కూడా ఆసక్తి చూపడం లేదు.కోట్లు పెట్టి ఎవరు మాత్రం ఇంత భారీ షోను ఈ సమయంలో ఎండోర్‌ చేస్తారు చెప్పండి. అందుకే బిగ్‌ బాస్‌ షోను ఈ ఏడాదికి ఆపేస్తేనే బెటర్‌ అనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చే వరకు ఇండియాలో ఏ బిగ్‌బాస్‌ షోలు ప్రసారం చేయబోవడం లేదట. అన్ని చోట్ల కూడా ఒకే పరిస్థితి కొనసాగుతోంది.హిందీ సీజన్‌కు కూడా ఈ సారి గండి పడ్డట్లే అంటున్నారు.ఇక తెలుగు బిగ్‌బాస్‌ మూడు సీజన్‌లకు ముగ్గురు హోస్ట్‌లుగా వ్యవహరించారు. నాలుగో సీజన్‌కు హోస్ట్‌ ఎవరు అనే చర్చ జరుగుతున్న సమయంలోనే కరోనా వచ్చింది.ఇటీవల బిగ్‌బాస్‌ను మా టీవీలో రీ టెలికాస్ట్‌ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ వస్తున్న ఎపిసోడ్స్‌కు మంచి స్పందన వస్తోంది.