Movies

మోస్ట్ అవైటెడ్ “కేజీయఫ్” స్మాల్ స్క్రీన్ వెర్షన్ రాబోతుంది.!

బాహుబలి సినిమా తర్వాత మన దక్షిణాది పవర్ ను దేశ వ్యాప్తంగా చూపించిన ఏకైక సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా “కేజీయఫ్ చాప్టర్ 1” సినిమా అని చెప్పాలి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం మన ఇండియన్ సినిమా హిస్టరీ లోనే అతి పెద్ద కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది.

ఈ సినిమా విడుదల కాబడిన ప్రతీ భాషలోనూ బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. అదే ఊపులో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా సంచలనం రేపింది. కానీ వీటన్నిటికీ భిన్నంగా ఈ సినిమా ఇప్పటి వరకు మన ఏ తెలుగు ఛానెల్లోనూ టెలికాస్ట్ కాకపోవడం ఇప్పటికీ ఆశ్చర్యం కలిగించే ప్రశ్నే.

దీనికి సమాధానం కష్టమే కానీ ఇన్నాళ్లకు ఈ చిత్రం తెలుగులో టెలికాస్ట్ కానున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే హిందీలో టెలికాస్ట్ అయ్యి అదరగొట్టిన ఈ చిత్రం అతి త్వరలోనే తెలుగులో కూడా టెలికాస్ట్ అవ్వనుంది అని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ చిత్రం ఏ ఛానెల్లో టెలికాస్ట్ అయినా సరే భారీ టీఆర్పీ కొల్లగొట్టడం ఖాయం అని చెప్పాలి.