Movies

మెగా ఫ్యామిలీ హీరోల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన వరుణ్ తేజ్

మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా తన ఆఫీస్ లోనే లాక్ డౌన్ లో ఉన్నాడు. బాక్సర్ గా నటించబోయే సినిమా కోసం బాక్సింగ్ నేర్చుకుంటున్న వరుణ్ తేజ్ కరోనా తో తన ఆఫీస్ లో ట్రైనర్ తో పాటుగా స్వీయ నిర్బంధంలో ఉన్నాడు. తాజాగా అభిమానులతో ఫెస్ బుక్ లైవ్ చాట్ కొచ్చిన వరుణ్ తేజ్ చాలా విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

అందులో భాగంగా తనకి హరీష్ శంకర్ అంటే క్రాష్ అని, గడ్డలకొండ గణేష్ చేసినప్పటి నుంచి హరీష్ శంకర్ అంటే క్రష్ అంటున్నాడు వరుణ్ తేజ్. అలాగే చరణ్ తో పాటు గుర్రపు స్వారీ నేర్చుకునే టైం లో గుర్రంపై నుంచి పడిపోవడంతో…. అప్పటి నుంచి గుర్రలవైపు వెళ్లలేదట వరుణ్ తేజ్. ఇక బాబాయ్ పవన్ కళ్యాణ్ లో నిజాయితీ నచ్చుతుందని,

పెదనాన్న చిరు లో అందరిని ప్రోత్సహించే గుణం ఇష్టమని, ఇక రామ్ చరణ్ తనకు భాయ్ అంటున్నాడు వరుణ్ తేజ్. ఇక అల్లు అర్జున్ లో, రామ్ చరణ్ లో నచ్చే గుణాలు వాళ్ళు కష్టపడే మనస్తత్వం అంటున్నాడు వరుణ్ తేజ్. ఇక లాక్ డౌన్ సమయంలో గద్దల కొండ గణేష్ చిత్రాన్ని పదకొండు సార్లు చూసా అని… గద్దలకొండ గణేష్ పాత్ర అంటే తనకి చాలా ఇష్టమని చెబుతున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్.