విజయ్ చేస్తున్న “ఫైటర్” సినిమా ఏ హీరో రిజెక్ట్ చేసాడో తెలుసా?
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ఫైటర్ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా ఈ సినిమానూ పూరి తనదైన మార్క్ చిత్రంగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ చాలా అల్ట్రా స్టైలిష్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది.స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాను తొలుత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో చేయాలని పూరి భావించాడట.దీని కోసం బన్నీకి కథ కూడా వినిపించాడట.గతంలో పూరి డైరెక్షన్లో దేశముదురు వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న బన్నీ, ఈసారి పూరికి నో చెప్పాడట.
దీంతో ఖంగుతిన్న పూరి, వెంటనే రౌడీకి కథ చెప్పడంతో పాటు సినిమాను ప్రారంభించాడు.ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు పూరి రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది.ఈ సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి-ఛార్మీ కలిసి నిర్మిస్తున్నారు.మరి బన్నీ రిజెక్ట్ చేసిన కథను పూరి ఎలా తీర్చిదిద్దుతాడో చూడాలి.