Movies

బాలయ్య,నాగ్ కల్సి చేయాలకున్న సినిమా ఇదే….ఎందుకు చేయలేదో తెలుసా ?

అప్పటిలో ఎన్టీఆర్,అక్కినేని కల్సి నటించిన గుండమ్మ కథ ఎంతగా హిట్ అయిందో తెల్సిందే. ఇప్పటికీ టివిలో ఈ సినిమా వస్తే, జనం టీవీలకు అతుక్కుపోతారు. తరువాత తరంలో ఈ మూవీని బాలకృష్ణ, నాగార్జున ఈ సినిమాలో నటించాలనుకున్నారు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదు. దీంతో ఒకే స్క్రీన్ పై వీళ్లిద్దరిని చూడాలకున్న అభిమానుల ఆశలు ఇప్పటికీ నెరవేరలేదు. ఇక తెలుగు తెర మొదటి తరం స్టార్ హీరోలైన నందమూరి , అక్కినేని తొలిసారి వీళ్లిద్దరు ‘పల్లెటూరు పిల్ల’ సినిమాలో కలిసి నటించారు. అలా వాళ్ల సినీ కెరీర్‌లో 14 సినిమాల్లో కలిసి నటించి , చివరగా ‘సత్యం శివం’ సినిమా చేసారు. ప్రపంచ సినీ చరిత్రలో ఇద్దరు అగ్ర హీరోలు ఇన్ని సినిమాల్లో కలిసి నటించలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ నట వారసుడిగా బాలయ్య,, అక్కినేని నటవారసుడిగా నాగార్జున సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తండ్రి తగ్గ తనయులుగా తమ కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇక వీళ్లిద్దరు కలిసి ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. కానీ వీళ్లిద్దరు కలిసి ఎన్టీఆర్, ఏఎన్నార్‌ కలిసి నటించిన ‘గుండమ్మ కథ’ను రీమేక్ చేద్దామనుకున్నారు. కానీ ఆ తర్వాత అది వర్కౌట్ కాకపోవడంతో , ఆ తర్వాత అక్కినేని, నందమూరి మూడో తరం వారసులు ఎన్టీఆర్, నాగ చైతన్య గుండమ్మ కథ సినిమా భవిష్యత్తులో చేస్తారమే చూడాలి. అయితే ఒక బాలయ్య, నాగ్‌లు గతంలో ఓ సినిమాలో కలిసి యాక్ట్ చేయాలనకున్నారు. అది కూడా హిందీలో హిట్టైయిన ‘చుప్కే చుప్కే’ సినిమా. అంతేకాదు అందుకు సంబంధించిన సీడీని అప్పట్లో నాగార్జునకు కూడా బాలయ్య ఇచ్చాడు. ఈ విషయాన్ని నాగార్జున ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు.

ఆ సినిమా చూసిన నాగార్జున ఎంతో ఇంప్రెస్ అయ్యారు కూడా. అంతేకాదు ఆ సినిమాకు సంబంధించిన వర్క్ కూడా బాలయ్య చేయించాడట. ఇక చుప్కే చుప్కే సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర హీరోలుగా నటించారు. హృషికేష్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించింది. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో ఈ ప్రాజెక్ట్ వెనక్కి పోయింది. ఈ రకంగా వెండితెరపై బాలకృష్ణ, నాగార్జున కాంబినేషన్ రాలేకపోయింది.ఇక నాగార్జునతో సినిమా చేయలేకపోయిన బాలయ్య.. ఆయన తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో ‘భార్య భర్తల బంధం, గాండీవం, శ్రీరామరాజ్యం’ ఈ మూడు సినిమాల్లో కలిసి నటించారు. . అటు నాగార్జున కూడా నందమూరి హరికృష్ణతో ‘సీతారామరాజు’ సినిమా చేసారు. అలాగే సుమంత్‌తో ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో నటించారు.