Movies

జగపతి బాబు క్రేజ్ బాలీవుడ్ దాకా…టాలీవుడ్ కి దూరం…?

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మహిళా ప్రేక్షకుల ఆదరణతో టాలీవుడ్ లో దూసుకెళ్లిన జగపతి బాబు మారిన పరిస్థితుల్లో విలన్ గా అవతారం ఎత్తాడు. హీరోగా ఎంతగా పేరుతెచ్చుకున్నాడో విలన్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. జగపతి బాబు సినిమాలు అనగానే ప్రేక్షకులకు ఒక ఆసక్తి ఉంటుంది. మహిళా ప్రేక్షకుల లో ఇప్పటికీ క్రేజ్ ఉన్న నటుడు అని చెప్పాలి.

ప్రస్తుతం జగ్గూభాయ్ తెలుగులో బాగా డిమాండ్ ఉన్న విలన్. తండ్రి, వ్యాపారవేత్త ఇలా తెలుగులో తన హవా నడుస్తోంది. ఇక జగ్గు కోసం బాలీవుడ్ స్టార్ హీరో లు కూడా పోటీ పడుతున్నారట. బాలీవుడ్ లో అగ్ర హీరోగా ఉన్న సల్మాన్ ఖాన్ జగపతి బాబుతో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. జగపతి బాబుతో సినిమా చేస్తే తెలుగులో కూడా తనకు కలిసి వస్తుందనే భావన సల్మాన్ ఖాన్ లో ఉందట.

ఇప్పటికే జగపతి బాబు తో సంప్రదింపులు కూడా జరిపి, తీసుకోవడానికి సల్మాన్ ప్రయత్నాలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది.ఈ సినిమాకు నిర్మాతగా సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తారని టాక్. ప్రస్తుతం జగపతి బాబు కన్నడం లో ఒక సినిమా తమిళంలో రెండు సినిమాలు మన తెలుగులో రెండు సినిమాలు చేస్తుండగా, ఈ సినిమాలు అయిన బాలీవుడ్ లో చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.