Movies

ఉదయ్ కిరణ్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు చెప్పిన సీనియర్ నటి

తెలుగు చిత్రాల్లో అక్క, అమ్మ, చెల్లి, వదిన వంటి పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సీనియర్ నటి సుధ గురించి తెలియని వారుండరు.ఈమె పాత్రలకి బాగా కనెక్ట్ అయినటువంటి ప్రేక్షకులు సుధని కొంతమంది తమ ఇంట్లో మనిషి లాగా చూస్తారు.అయితే తాజాగా సుధ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొంది.ఇందులో భాగంగా తన జీవితంలో కొన్ని సంఘటనలను ప్రేక్షకులతో పంచుకుంది.

ఇందులో ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో ఉదయ్ కిరణ్ తనతో చాలా చనువుగా ఉండేవాడని అంతేగాక అప్పుడప్పుడు ఉదయ్ కిరణ్ తనతో మిమ్మల్ని చూస్తే మా అమ్మ లాగా అనిపిస్తుందని అందువల్ల తనతో తనకి సంబంధించినటువంటి అన్ని విషయాలను చెప్పుకునేవాడని తెలిపింది.ఒకానొక సమయంలో ఉదయ్ కిరణ్ ని దత్తత కూడా తీసుకోవాలని అనుకున్నానని, కానీ ఒక్కసారిగా ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడం తనను తీవ్రంగా కలచి వేసిందని ఎమోషనల్ అయింది.ఒకవేళ ఉదయ్ కిరణ్ ని తాను దత్తత తీసుకుని ఉంటే కచ్చితంగా ఆత్మహత్య చేసుకోనిచ్చే దానిని కాదని తెలిపింది

అలాగే సినీ పరిశ్రమలో తాను దాదాపుగా అందరి స్టార్ హీరోల చిత్రాల్లో ఆర్టిస్టుగా పనిచేశానని కూడా తెలిపింది.ప్రస్తుతం తన కుటుంబ బాధ్యతలు చక్కబెట్టుకునే పనిలో బిజీ అయ్యానని అందువల్ల సినిమాలకు కొంత తక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందని చెప్పు కొచ్చింది.