Movies

మెగా ఫ్యాన్స్‌ను చూసి నందమూరి ఫ్యాన్స్‌ కుళ్లుకుంటున్నారట…కారణం ఇదే

ప్రస్తుతం మెగాస్టార్‌ సోషల్‌ మీడియాలో కుమ్మేస్తున్నాడు.ప్రతి రోజు ఏదో ఒక పోస్ట్‌తో నెటిజన్స్‌ను అలరిస్తూనే ఉన్నాడు.మెగా సందడి ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది.ఇక సమయం వచ్చినప్పుడు బన్నీ, సాయి ధరమ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌, చరణ్‌, శిరీష్‌, కళ్యాణ్‌, నిహారిక, పవన్‌, నాగబాబులు కూడా ట్వీట్స్‌ చేస్తూ ఉంటారు.

మెగా ఫ్యామిలీ నుండి ఎప్పుడు ఏదో ఒక ట్వీట్‌ లేదా సోషల్‌ మీడియా పోస్ట్‌ పడుతూనే ఉంటుంది. చిరంజీవి ట్వీట్స్‌తో మెగా ఫ్యాన్స్‌ తడిసి ముద్ద అవుతున్నారు.తాజాగా చిరంజీవి తన ఫ్యామిలీ పిక్‌ను పోస్ట్‌ చేసి ప్రతి ఆదివారం ఇలా సరదాగా సమయం గడిపే వాళ్లం.కాని ఇప్పుడు లాక్‌డౌన్‌ వల్ల వీలు పడటంలేదు అంటూ చిరంజీవి పోస్ట్‌ చేశాడు

ఆ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.అలాగే చాలా పోస్ట్‌ను కూడా చిరంజీవి పోస్ట్‌ చేస్తూ ఫ్యాన్స్‌కు ఎప్పుడు చాలా దగ్గరగా ఉంటున్నాడు.దాంతో ఈమద్య మెగా ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు.మెగా ఫ్యాన్స్‌ సందడి ముందు నందమూరి ఫ్యాన్స్‌ సందడి కనిపించడం లేదు. నందమూరి ఫ్యామిలీ హీరోలు ఎన్టీఆర్‌ చాలా అరుదుగా పోస్ట్‌లు పెడుతూ ఉంటాడు.కళ్యాణ్‌ రామ్‌ కూడా ఎప్పుడో కాని సోషల్‌ మీడియాలో కనిపించడు.

ఇక బాలయ్య ట్విట్టర్‌కు చాలా దూరంగా ఉంటాడు.ఫేస్‌బుక్‌ ఉన్నా కూడా అందులో అప్పుడప్పుడు మాత్రమే పోస్ట్‌లు పెడతాడు.అందుకే నందమూరి ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు లేకపోవడంతో తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు.మెగా ఫ్యాన్స్‌ సందడి చూసి నందమూరి ఫ్యాన్స్‌ కుళ్లుకుంటున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.