దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇప్పటి వరకు వాడని పండు ఏమిటో తెలుసా ?
దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు టాలీవుడ్ సినిమాల్లో సాంగ్స్ కి ఓ స్పెషాల్టీ ఉంటుంది. ముఖ్యంగా భామను అందంగా ఎలా చూపించాలో బాగా తెలిసిన దర్శక దిగ్గజం కూడా. హీరోయిన్ ను తెరపై ఏ ఏ యాంగిల్స్ లో ఎంత అందంగా చూపించాలో ఈయనకు తెలిసినంతగా మరొకరికి తెలీదు. ఒక్కమాటలో చెప్పాలంటే, దర్శకేంద్రుడి కెమెరాకు ప్రతి భామ ఒక ముద్దబంతి పూవ్వే. పదహారేళ్ల వయసు కన్నెపిల్ల భావాలను సిరిమల్లె పువ్వులా ఆవిష్కరించి, కథానాయికను శృంగారదేవతగా చూపించినా ఆయనకే చెల్లింది.
రాఘవేంద్రరావు రూపొందించే సినిమాల్లో కథ, కథనంతో పాటు మ్యూజిక్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ,పాటల చిత్రీకరణలో తనదైన మార్క్ చూపిస్తారు. హీరోయిన్ ను గ్లామర్ గా చూపించడంలో దర్శకేంద్రుడి రూటే వేరు. అందుకనే ఆయన మూవీని కేవలం పాటల కోసం మాత్రమే చూసే ప్రేక్షకులు నేటికి ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ నాభిపై వేసే పూలు, పండ్ల కోసం రిపీట్ ఆడియన్స్ ఉండేవారంటే దర్శకేంద్రుడి ప్రత్యేకత చెప్పక్కర్లేదు. అయితే ఇప్పటి వరకు రాఘవేంద్రరావు వాడని పండు ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. రాఘవేంద్ర రావు ఇప్పటి వరకు వెళ్లిన ప్రతి ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ ఫేస్ చేసేవారు.
ఇక ఆయన తెరకెక్కించిన సినిమాల్లో జయప్రద, జయసుధలపై మాత్రమే ఆయన ఎలాంటి పండ్లను వేయలేకపోయారు. ఆయన దర్శకత్వంలో నటించిన ఏ హీరోయిన్ కూడా ఆయన పండ్ల దెబ్బల నుంచి తప్పించుకోలేకపో యింది. ఇక పండు మీద కూడా ఓ పాట కూడా ఉంది. ఆయన తీసే సినిమాల్లో సన్నివేశాలు పాటలు ప్రేక్షకుల మదిలో అలా గుర్తుండిపోయాయి. ఇక రాఘవేంద్ర రావు ఇప్పటి వరకు హీరోయిన్స్ పై వాడని పండు ఏదని చెప్పాలంటే, అది పనస పండు అని చెప్పక తప్పదు. ఆయన ఏ సినిమాల్లో ఈ పండును హీరోయిన్స్‌పై వేయలేదు.