Movies

జక్కన్న అభిమాన డైరెక్టర్ ఎవరో తెలుసా?

ఓటమి ఎరుగని ధీరునిగా, బాహుబలి మూవీతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఇంకా చెప్పాలంటే, ప్రపంచం వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ ప్రేమికులకు మోస్ట్ ఫేవరేట్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ రాజమౌళి మారిపోయాడు. ప్రస్తుతం రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు హీరోలుగా నటించిన ఈ సినిమాలో ఆలియా భట్ ఓలివియాలు హీరోయిన్స్ గా చేస్తున్నారు.

ఇక ఎంతో మంది స్టార్స్ కు ఫేవరేట్ డైరెక్టర్ గా ఉన్న రాజమౌళికి కూడా ఒక ఫేవరెట్ డైరెక్టర్ ఉన్నాడట. తాజాగా ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని స్వయంగా జక్కన్న చెప్పుకొచ్చాడు. గతంలో సుకుమార్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం అంటే ఇష్టం అంటూ చెప్పిన రాజమౌళి ఈసారి మాత్రం తన అభిమాన దర్శకుడు సుకుమార్ అని తేల్చాడు.

వారి సినిమాలో కాస్త మాస్ ఎలిమెంట్స్ పై దృష్టి పెడితే ఖచ్చితంగా అద్బుతమైన సినిమాలు వస్తాయంటూ గతంలో ఒక ఇంటర్వ్యూలో సుకుమార్.. త్రివిక్రమ్ ల గురించి రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఇప్పుడు సుకుమార్ చేస్తున్న సినిమాలు మాస్ ఎలిమెంట్స్ కలిగి ఉంటున్నాయని, ఈమద్య కాలంలో చేసిన సినిమాల్లో స్టోరీ నారేషన్ బాగుంటుం దని చెప్పాడు. ఈమద్య కాలంలో ఆయనకు అభిమానిగా మారనున్నాడు ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప చిత్రంపై తాను చాలా ఆసక్తిగా ఉన్నట్లుగా జక్కన్న చెప్పుకొచ్చాడు.