“వకీల్ సాబ్”పై ఇంట్రెస్టింగ్ అప్డేట్…అభిమానులకు పండగే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దాదాపు రెండున్నర ఏళ్ళు తర్వాత మొదలు పెట్టిన చిత్రం “వకీల్ సాబ్”. దీనితో ఈ సినిమాను ప్రకటించడంతోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు పరిస్థితులు కనుక బాగుండి ఉన్నట్టయితే ఈపాటికే టీజర్ కూడా వచ్చి ఉండేది.
కానీ కరోనా కారణంగా పరిస్థితులు ఊహించని విధంగా మారిపోవడంతో అన్ని సినిమాల్లానే ఈ సినిమా నుంచి కూడా ఎలాంటి అప్డేట్స్ లేకుండా పోయాయి. దీనితో అప్పటి వరకు షూట్ చేసిన సినిమా నుంచి అయినా మరో లుక్ అయినా విడుదల చెయ్యాలి అని పవన్ ఫ్యాన్స్ భావించారు.
కానీ చిత్ర యూనిట్ నుంచి ఎలాంటివో ఉలుకు లేదు. కానీ ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర అప్డేట్ ను దర్శకుడు వేణు శ్రీరామ్ బయటపెట్టినట్టు తెలుస్తుంది. ఈ సినిమాను తాము రెండున్నర గంటలు అనుకుంటున్నామని ఇంకా అరగంట మాత్రమే షూట్ చెయ్యాల్సి ఉందని వారు తెలిపారు. శృతిహాసన్ డేట్స్ కోసం తాము ప్రయత్నిస్తున్నామని ఈ లాక్ డౌన్ అనంతరం ఆమెను సంప్రదించి మిగతా పార్ట్ ను పూర్తి చేస్తామని తెలిపారు.