కాలజ్ణానం ప్రకారం “బ్రహ్మం” గారు చెప్పిన వాటిలో…ఇప్పటివరకు నిజమైన 10 విషయాలు ఇవే.!
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 17వ శతాబ్దములో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి,హేతువాది, సంఘ సంస్కర్త . బ్రహ్మం గారు తన కాలజ్ఞానములో భవిష్యత్ లో ఎలాంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఉహించి చెప్పారు .వాటిల్లో చాలా వరకు నిజమయ్యాయి . అందులో మనల్ని ఆశ్చర్యపరిచే పది ముఖ్యమైన విషయాలు మీకోసం.
1.కాశీ లోని దేవాలయం నలభై రోజులు పాడుపడుతుంది అని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే 1910 – 12 మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులెవ్వరూ వెళ్ళలేదు. అలా 40రోజులపాటు కాశీ దేవాలయం మూసి ఉంది.
2. ఒక అంబ పదహారు సంవత్సరాలు రాజ్యమేలుతుంది అన్నారు. ఇక ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాలపాటు మన దేశానికి ప్రధానిమంత్రిగా వున్నారు.
3. రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయి అని బ్రహ్మంగారు తెలియచేశారు. ఇప్పుడు భారతదేశంతో రాచరిక వ్యవస్థ అనేది లేదు.జమిందారి వ్యవస్థ కూడా నశించింది. ఉన్నదల్లా ప్రజలు, ప్రభుత్వం..ఈ ప్రభుత్వం అనేది ప్రజల చేతుల్లోనే ఉంటుంది..ప్రజలు స్వయంగా ఎన్నుకుంటేనే నాయకులు గెలుస్తారు.
4. తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు, వారి రంగును చూసి ప్రజలు మోసపోతారు అని బ్రహ్మంగారు కాలజ్ణానం లో చెప్పారు.. తమిళనాడులో జయలలిత, ఎంజీఆర్ నుండి మన దగ్గర ఎన్టీఆర్ , చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇలా ఎంతో మంది సినిమాల నుండి రాజకీయాలవైపు వచ్చారు.
5. ఆకాశాన పక్షివాహనాదులు కూలి అనేకమంది మరణిస్తారని బ్రహ్మంగారు తెలియచేసిననాటికి విమానాలే పుట్టలేదు.. పుష్పకవిమానం అనేది కథల్లో ఉండేవి.ఆ తర్వాత విమానాలు వచ్చాయి. అవి ప్రమాదానికి గురై ప్రజలు ఎంతో మంది మరణిస్తున్నారు.
6. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని చెప్పారు పోతులూరి వీరబ్రహ్మం గారు. ఇప్పటివారికి తెలియదు కానీ, వంద సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు వుండేవి. ప్రస్తుతం బ్రహ్మం గారి కాలజ్ణానం ప్రకారం ఎక్కడా అగ్రహారాలు లేవు.
7. రావణ కాష్టమున కల్లోలము చెలరేగి దేశాన్ని అల్లకల్లోల పెట్టేను అని వివరించారు బ్రహ్మంగారు. రావణుని దేశం అంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళులు, శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి..చివరికి ఆ వైరమే అవి రాజీవ్ గాంధిని బలిగొన్న విషయం తెలిసిందే.
8. గట్టివాడయిన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు అని బ్రహ్మంగారు కాలజ్నానంలో తెలియచేశారు. ఇప్పటివరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడయిన లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమయిన పాలనను అందించారు.
9. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ, చావు పుట్టుకలు మాత్రం కనుగోనలేకపోతారు. సృష్టిని మార్చటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు..ఇప్పుడు ఎన్నో రకాల శస్త్రచికిత్సలు జరుగుతున్నప్పటికి,వైధ్యరంగం అభివృద్ది జరిగినప్పటికి చనిపోయిన వారిని బతికించే యంత్రం, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటివరకూ కనుక్కోలేదు..ఇకపై కనుక్కుంటారో లేదో తెలియదు.
10. ప్రజలు తెల్లటి కొరువులు నోట కరుచుకుని తిరుగుతారు. తెల్లటి కొరువులు అంటే సిగరెట్లు. ఇప్పుడు చిన్నా పెద్దా, ఆడా మగా అనే తేడా లేకుండా సిగరెట్లకి అలవాటు పడుతున్నారు.ఈ అలవాటు ఇకపై తగ్గుతుందని చెప్పలేం .