పుష్పలో మరో బ్యూటీ.. అసలు కథ ఆమెతోనేనట!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఇటీవల రిలీజ్ చేయగా ప్రేక్షకులను దగ్గర్నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.కాగా ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోందని తెలుస్తోంది.
అలాగే ఈ సినిమాలో నివేథా పేతురాజ్ కూడా నటిస్తున్నట్లు చిత్ర వర్గాల సమాచారం.కాగా ఈ సినిమాలో మరో బ్యూటీ నివేదా థామస్ కూడా నటిస్తుందట.ఈ సినిమాలో అసలు కథ ఆమె చుట్టే తిరుగుతుందని తెలుస్తోంది.
అందరూ అనుకుంటున్నట్లు ఈ సినిమాలో బన్నీ రష్మికను ప్రేమించడట, నివేదా థామస్‌ను ప్రేమిస్తాడట. కానీ దుండగులు ఆమెను చంపివేయడంతో వారిపై పగతీర్చుకునే పనిలో సినిమా కథ నడుస్తుందని తెలుస్తోంది.ఇక పోలీస్ ఆఫీసర్ పాత్రలో రష్మిక మందన్న కనబడుతుందని తెలుస్తోంది.మొత్తానికి పుష్ప సినిమా ఎవ్వరి ఊహలకు అందకుండా ఉండనున్నట్లు తెలుస్తోంది.