సినిమాల్లేకున్నా బిజినెస్ ప్లాన్ లో రకుల్ సూపర్….కొత్త బిజినెస్ ఇదే
కన్నడ సినిమా ‘గిల్లీ’తో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా రాణించింది. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను చాలామంది సెలబ్రిటీలు పాటిస్తున్నారు. దీన్ని రకుల్ అక్షరాలా నిజం చేస్తోందన్న విషయం ఇండస్ట్రీలో అందరూ చెప్పేమాట. స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే తన సంపాదనను చాలా వరకు వ్యాపారంలోనే ఇన్వెస్ట్ చేసింది. స్టార్ హీరోలు కూడా చేయలేని ధైర్యం ఆమె చేస్తూ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. F – 45 పేరుతో జిమ్ మొదలుపెట్టి బిజినెస్ ఉమెన్ అయిపోయింది.
ఓ వైపు జిమ్.. మరోవైపు జిమ్ బిజినెస్ చేస్తూ బిజీగా ఉంది రకుల్. జిమ్ బిజినెస్ లో తనకు తానె పోటీ గా నిల్చింది. ఈ జిమ్ వ్యాపారాన్ని ఆమె బ్రదర్ చూసుకుంటున్నాడు. నిజానికి ఆమెకు ప్రస్తుతం ఇక్కడ అవకాశాలు తగ్గాయని చెప్పవచ్చు. ‘కెరటం’ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోల సరసన నటించి లక్కీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. మహేష్ బాబు , రవితేజ , ఎన్టీఆర్ , రామ్ చరణ్ , నాగచైతన్య , సూర్య , కార్తీ ,అల్లు అర్జున్, రామ్ వంటి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసింది. అయితే గత రెండు సంవత్సరాలుగా రకుల్ కెరీర్ డౌన్ ఫాల్ అయింది. ముఖ్యంగా గతేడాది అక్కినేని నాగార్జునతో నటించిన ‘మన్మథుడు 2’ కూడా నిరాశ మిగిల్చింది. రకుల్ త్వరలో ఒక బయోపిక్ లో నటించబోతున్నారని టాక్.
దాంతో ఆఫర్స్ వచ్చినా రాకపోయినా తనకు ఉన్న బిజినెస్ చూసుకుంటూ రకుల్ హాయిగా గడిపేస్తోంది. ఈ మధ్య ఒక సందర్భంలో సినిమాలు – ఫుడ్ – ఫిట్ నెస్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటానని చెప్పిందట. అంతేకాకుండా ఇప్పటికే సినిమాలు – జిమ్ లతో బిజీగా ఉన్న రకుల్ త్వరలో ఫుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతోందట. మంచి ఫుడ్ తింటే మనం హ్యాపీగా ఉండటంతో పాటు హెల్తీగా కూడా ఉంటారని.. అందుకే తన ఫ్రెండ్స్ కి డైట్ సజెస్ట్ చేస్తూ ఉంటానని రకుల్ చెప్పుకొచ్చిందట. రాబోయే రోజుల్లో మనం రకుల్ ని డిఫరెంట్ రోల్ లో చూడబోతున్నామన్నమాట. ఏది ఏమైనా రకుల్ అటు సినీ రంగంలో రాణిస్తూనే ఇలా వ్యాపార రంగంలో కూడా తన ప్రత్యేకతను చాటుకోవటాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.