Movies

“అమెజాన్ ప్రైమ్”లో దుమ్ము లేపుతున్న మహేష్ సినిమాలు…అవి ఏమిటో చూడండి

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. కేవలం ఒకే ఏజ్ ఒకే ప్లాట్ ఫామ్ కు మాత్రమే పరిమితం కాకుండా అన్ని మూలలా సూపర్ స్టార్ క్రేజ్ ఊహించని రీతిలో ఉంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ లో మహేష్ క్రేజ్ అనన్య సామాన్యం.

ఇప్పుడు ఆ క్రేజే మహేష్ కు అన్ని రంగాల్లోనూ ఎనలేని రికార్డులను అందిస్తుంది. ఒక్క వెండితెర మీద మాత్రమే కాకుండా బుల్లితెర మరియు డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లో కూడ మహేష్ సినిమాలు జనం ఎగబడి చూస్తారు. ఇప్పుడు అదే విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది.

ప్రపంచ ప్రసిద్ధి స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో మహేష్ మూడు సినిమాలు రికార్డు స్థాయి వ్యూస్ సంపాదించాయి. ప్రైమ్ లో ఉన్న అన్ని తెలుగు సినిమాల్లోనూ టాప్ 5 లో మహేష్ వే మూడు సినిమాలు ఉండడం విశేషం. మొదటి స్థానంలో కొరటాల శివతో తీసిన “భరత్ అనే నేను” 43 మిలియన్లు.

రెండో స్థానంలో వంశీ పైడిపల్లితో తీసిన “మహర్షి” 23 మిలియన్లు అలాగే లేటెస్ట్ సెన్సేషన్ “సరిలేరు నీకెవ్వరు”17 మిలియన్ వ్యూస్ తో ఐదవ స్థానంలోకి వచ్చేసింది.దీనితో టాప్ 5 సినిమాల్లో మూడు సినిమాలు మహేష్ వే ఉన్నాయి. అంటే డిజిటల్ గా కూడా మహేష్ సినిమాలు ఏ స్థాయిలో ఆకట్టుకుంటున్నాయో మనం అర్ధం చేసుకోవచ్చు.