Movies

పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ఎంత కష్ట పడ్డారో తెలుసా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయ్యాక సినిమాల జోలికి వెళ్ళలేదు. అయితే దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ముఖానికి రంగు వేసుకొని పవన్ తన అభిమానుల ముందుకు వస్తున్నారు. అయితే పింక్ రీమేక్ చిత్రం అయిన వ కిల్ సాబ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని విషయాలను దర్శకుడు వేణు శ్రీరామ్ తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ జరిగే సమయంలో పవన్ దాదాపు 600 కిలో మీటర్లు ప్రయాణం చేసేవారు అని వ్యాఖ్యానించారు. సినిమా షూటింగ్ కు సంబంధించి ఎలాంటి ఆటంకం రాకుండా పవన్ కళ్యాణ్ చాలా కష్టపడ్డారు అని అన్నారు. పవన్ కళ్యాణ్ ప్రతి రోజు విజయవాడ నుండి హైదరాబాద్ కి, హైదరాబాద్ నుండి విజయవాడ కి ప్రయాణం చేశారు అని, దాదాపు 22 రోజులు షూటింగ్ జరిగింది. షూటింగు జరిగినన్ని రోజులు ఒక్క రోజు కూడా షూటింగ్ మిస్ చేయకుండా పవన్ వచ్చారు అని వ్యాఖ్యానించారు.

అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఒక సంతోషకర విషయాన్ని వెల్లడించారు. దాదాపు ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయింది అని వివరించారు. అయితే ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, ప్రకాష రాజ్, అనసూయ తదితర కీలక పాత్రలు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇలియానా అతిధి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం పూర్తి అయిన వెంటనే పవన్ మిగతా సినిమాలు పూర్తి చేసే పని లో ఉన్నారు. అయితే ఈ లాక్ డౌన్ పూర్తి అవ్వగానే పవన్ సినిమా త్వరగానే వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.