Movies

“నెట్ ఫ్లిక్స్” లో ఇంకా “అల వైకుంఠపురములో” హవా..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “అల వైకుంఠపురములో” థియేటర్లులోకి వచ్చి వంద రోజులు గడిచిపోయింది. అలాగే డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చి కూడా దగ్గరదగ్గరగా 50 రోజులు కావస్తుంది.

అయినప్పటికీ అప్పుడు థియేటర్స్ లో ఎలాంటి హవాను ఈ చిత్రం కొనసాగించిందో అంతే స్థాయి హవా డిజిటల్ గా కూడా సాగిస్తోంది అని చెప్పాలి.ఈ సినిమాను సన్ నెక్స్ట్ తో పాటుగా నెట్ ఫ్లిక్స్ వారు స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

ఒకేరోజు అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ చిత్రం ఇన్ని రోజులు కావస్తున్నా నెట్ ఫ్లిక్స్ లో ఇంకా ట్రెండింగ్ లో నిలిచి ఆశ్చర్యపరుస్తుంది. ఈరోజు నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో ఉన్న టాప్ 10 సినిమాల జాబితాను వారు విడుదల చెయ్యగా అందులో విజయ్ నటించిన తాజా చిత్రం “వరల్డ్ ఫేమస్ లవర్” నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుండగా “అల వైకుంఠపురములో” ఏడవ స్థానంలో ట్రెండ్ అవుతుంది.బన్నీ సినిమా వచ్చి ఇన్ని రోజులైనా హవా మాత్రం ఇంకా తగ్గలేదని చెప్పాలి.