గ్లామరస్ పాత్రలకు సిద్దమైన మెగా డాటర్…చిరు రియాక్షన్ ఇదే
మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటివరకు చాలా మంది హీరోలు వచ్చారు. హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు ట్రై చేస్తున్న ది మాత్రం కొణిదెల నీహారిక. ఒక మనసు చిత్రం ద్వారా తెలుగు తెర కు పరిచయం అయిన నీహారిక ఇప్పటివరకు కూడా ఒక్క హిట్ ను కూడా దక్కిచుకోలేకపోయింది. అయితే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న నీహారిక వెబ్ సీరీస్ లలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే తాజాగా ఇచ్చిన ఒక లైవ్ ఇంటర్వ్యు లో నీహారిక ఈ విషయాలను వెల్లడించారు.
అయితే ఇప్పటివరకు క్లీన్ లవ్ స్టోరీస్ లో నటించిన నీహారిక మొదటిసారిగా గ్లామరస్ పాత్రలో నటించేందుకు సిద్దం అయినట్లు తెలుస్తుంది. దీని పై క్లారిటీ కూడా ఇచ్చేశారు. అవును నటిస్తున్నా అని వ్యాఖ్యానించారు. అయితే అది తమిళ్ సినిమా అని తెలుస్తోంది. గోవా బీచ్ లో రొమాంటిక్ సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నారు అని వ్యాఖ్యానించారు. అయితే పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తారా అని అడగగా చాలా వింతగా సమాధానం ఇచ్చారు. నేనేమైనా సమంతనా పెళ్లి తర్వాత కూడా నటిస్తారా అని అడగడానికి అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఆ విషయం ఇపుడు చెప్పలేను అని వ్యాఖ్యానించారు. మంచి స్క్రిప్ట్ లని ఎంచుకొని ఎక్కువ సినిమాల్లో నటించాలని అన్నారు.