“ప్రైమ్” లో ఉన్న మరో సినిమా “ఆహా” లో కూడా.!
అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి దిగ్గజ స్ట్రీమింగ్ యాప్స్ మన దేశంతో పాటుగా తెలుగు ఆడియెన్స్ లో కూడా మంచి పాపులారిటీని తెచ్చుకున్నాయి. కానీ మొట్ట మొదటి సరిగా మన తెలుగు నుంచి కూడా ఒక స్ట్రీమింగ్ యాప్ అందుబాటులోకి వచ్చింది.
అదే గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ మొదలు పెట్టిన “ఆహా” స్ట్రీమింగ్ యాప్. గత ఏడాది డిసెంబర్ లో విడుదల కాబడిన ఈ యాప్ మన తెలుగు ఆడియెన్స్ లో మంచి పాపులారిటీను సంతరించుకుంది. ఇదిలా ఉండగా అమెజాన్ ప్రైమ్ లో ఉన్న సినిమాలే కొన్ని ఆహా లో కూడా కనిపిస్తున్నాయని వీక్షకులు అంటున్నారు.
గత కొన్ని రోజుల కితమే “రాజావారు రాణిగారు” అనే సినిమాను ఆహా లో కూడా స్ట్రీమ్ చేస్తున్నామని చెప్పగా అప్పుడు కూడా ఆడియెన్స్ సోషల్ మీడియాలో రెండిట్లో ఎందుకు అని అడిగారు. ఇప్పుడు అలాగే మరో సినిమా “అనుకున్నది ఒకటి అయినది ఒకటి” కూడా ఆహా లో ఉందని చెప్పగా అది కూడా అమెజాన్ ప్రైమ్ లో ఉంది ఆమాత్రం దానికి ఆహా లో కూడా ఎందుకని నెటిజన్స్ అడుగుతున్నారు.