Movies

నాగబాబు ఇంటిలో ఎలా ఉంటాడో ఒక్కసారి లుక్ వేయండి

మెగాస్టార్ సోదరుల్లో నాగబాబుకు గల క్రేజ్ వేరు. టివి షోస్ లో దూసుకెళ్తూ,సోషల్ మీడియాలో కూడా సెటైర్లతో తనదైన పంథా అనుసరిస్తుంటాడు. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో ఈ మధ్య మెగా బ్రదర్ నాగబాబు చాలా మారిపోయాడు. బరువు తగ్గిపోయి పూర్తిగా మేకోవర్ అవ్వడంతో నాగబాబును చూసి ఫ్యాన్స్ కూడా షాకవుతున్నారు. నాగబాబు ఇంతగా మారిపోయాడా అని ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ మధ్య నాగబాబు ఎప్పుడు బయటికి వచ్చినా కూడా పూర్తిగా విగ్గుతోనే వస్తున్నాడు . అందుకే ఒరిజినల్ గెటప్‌లో చూసి చాలా రోజులు అవుతుంది.

ప్రస్తుతం లాక్ డౌన్ వలన నాగబాబు బయటికి కూడా రావడం లేదు . విగ్గు లేకపోయినా పూర్తిగా మేకప్ వేసుకుని కనిపిస్తుంటాడు . అయితే లాక్ డౌన్ పుణ్యమా అని ఆయన ఒరిజినల్ గెటప్ లో కనిపిస్తున్నాడు. లాక్ డౌన్ రోజుల్లో ఆయన జబర్దస్త్ కమెడియన్లతో పాటు యాంకర్ రవి లాంటి వాళ్లకు ఫోన్స్ చేసి మాట్లాడుతున్నాడు. అన్ని విషయాలు తెలుసుకుంటున్నాడు. దీంతో నాగబాబు గెటప్ చూసి అంతా షాక్ అవుతున్నారు.

నాగబాబుని చూసి సర్ ఏంటి ఇలా అయిపోయారు అంటూ అందరూ అడుగు తున్నారు. మీసాలు, గడ్డం తీసేసి కొత్తగా కనిపిస్తున్నాడు. మేకప్, విగ్గు కూడా లేకపోవడంతో వయసు కూడా నాగబాబుకు ఎక్కువే ఉన్నట్టు కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత విగ్గు లేకుండా కనిపించడంతో ఫ్యాన్స్ కూడా ఒరిజినల్ రూపం చూసి పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై బిజీగా ఉంటూనే సినిమాల కోసం చూస్తున్నాడు. ఆ మధ్య కావాలనే మేకోవర్ అయిపోయాడు. బరువు తగ్గిపోయి స్లిమ్ లుక్‌తో, అందునా ఒరిజినల్ గెటప్‌తో ఔరా అనిపిస్తున్నాడు.