Movies

ప్రదీప్ సినిమాకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలుసా?

యాంకర్ నుండి హీరోగా మారిన వారు టాలీవుడ్‌లో చాలా మంది ఉన్నారు.ఈ జాబితాలో తాజాగా మరో యాంకర్ కూడా వచ్చి చేరుతున్నాడు. బుల్లితెరపై తనదైన మార్క్ వేసుకున్న ప్రదీప్ మాచిరాజు, ప్రస్తుతం వెండితెరపై హీరోగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.

ఈ సినిమా మార్చి 31న రిలీజ్ కావాల్సి ఉంది.కానీ ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ పరిస్థితుల కారణంగా ఈ సినిమా వాయిదా పడింది.దీంతో ఈ సినిమా ఇప్పట్లో రిలీజ్ అయ్యేలా లేదని చిత్ర వర్గాలు అంటున్నాయి.కాగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట.ఈ సినిమాను కొనేందుకు ఓటీటీ ప్లాట్‌ఫాం వారు చాలా తక్కువ ధరకు సొంతం చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు.

కాగా ఈ సినిమాకు ఏకంగా రూ.4.5 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.మేకింగ్‌కు నిర్మాతలు రూ.2 కోట్లు ఖర్చు చేశారట.కేవలం ప్రమోషన్స్ కోసమే కోటి రూపాయలను పెట్టినట్లు తెలుస్తోంది.మిగతాదంతా వడ్డీ రూపంలో చిత్ర నిర్మాతలపై ఉందని తెలుస్తోంది.ఈ సినిమా హిట్ అయితే తాము పెట్టిన ఖర్చు తిరిగి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.కానీ ఈ సినిమాను సొంతం చేసుకునేందుకు ఓటీటీ యాజమాన్యాలు సకల ప్రయత్నాలు చేస్తున్నాయి.