40 Years ఇండస్ట్రీ ఉన్న మెగాస్టార్ అలా ఎందుకు ఒప్పుకున్నాడో…నిజంగా గ్రేట్
ఎన్ని సినిమాలు చేసినా,ఎంత స్టార్ ఇమేజ్ ఉన్నా సరే, ఒక్కోసారి కొన్ని పాత్రలకు ఒప్పుకోక తప్పదు. అన్ని రకాల పాత్రలు చేయడంలోనే సంతృప్తి ఉంటుంది. అయితే ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు దాటిపోయిన మెగాస్టార్ చిరంజీవి ఇన్నేళ్లలో 151 సినిమాలు పూర్తి చేసాడు. తనకంటూ ఇండియన్ సినిమాలో ప్రత్యేకమైన చరిత్ర సృష్టించాడు. 60 ఏళ్ల వయస్సు దాటినా కూడా ఏమాత్రం జోరు తగ్గకుండా వరస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయింది. లాక్ డౌన్ తర్వాత మిగిలిన భాగం కూడా పూర్తి చేయాల్సి ఉంది.
ఇక రాజమౌళి కూడా అనుమతి ఇవ్వడంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పార్ట్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కొరటాల చూస్తున్నాడు. ఇందుకోసం నెల రోజుల కాల్షీట్స్ చెర్రీ ఇచ్చేసాడు కూడా. దీని తర్వాత మెగాస్టార్ లూసీఫర్ రీమేక్ చేయబోతున్నాడు. సాహో దర్శకుడు సుజీత్ తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే కథ కూడా సిద్ధం చేస్తున్నాడు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు రీమేక్ లో కొన్ని మార్పులు కూడా చేస్తున్నాడు. వీడియో కాల్‌లో చిరు, సుజీత్ మాట్లాడు కోవడం వలన కావాల్సిన మార్పులు చేర్పులు చిరు కూడా సూచిస్తున్నాడు. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ లో మోహన్ లాల్, పృథ్వీ రాజ్ హీరోలుగా నటించారు. ఇందులో మోహన్ లాల్‌కు హీరోయిన్ ఉండదు.
తెలుగులో చిరంజీవి కాబట్టి కచ్చితంగా హీరోయిన్ లేకుండా ఎలా ఉంటుందని మెగా ఫాన్స్ అనుకున్నారు. కానీ మెగాస్టార్ ఈ విషయంలో రిస్క్ తీసుకోడానికే రెడీ అవుతున్నట్లు టాక్ నడుస్తోంది. హీరోయిన్ లేకుండానే లూసీఫర్ రీమేక్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ కూడా చిరంజీవి ఇచ్చేసాడని అంటున్నారు. తెలుగు వర్షన్‌లో మార్పులు చేసినా కూడా హీరోయిన్‌ను తీసుకొచ్చి పెట్టేంత మార్పులు మాత్రం చేయడం లేదు. అందుకే ఉన్నదున్నట్లు చేస్తూనే కాస్త మార్పులు చేయాలని సుజీత్ భావిస్తున్నాడు. ఇదే నిజమైతే, చిరంజీవి నిజంగానే హీరోయిన్ లేకుండా సినిమా చేస్తే.. 42 ఏళ్ల కెరీర్‌లో తొలిసారి జోడీ లేకుండా చేసిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేస్తాడు. దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.