అకీరాను హీరోగా లాంచ్ చేసే డైరెక్టర్ ఎవరో తెలుసా?
టాలీవుడ్ లో చాలా వార్తలు చక్కర్లు కొడుతుంటాయి. అయితే అందులో ఏది నిజమే ఏది అబద్దమో క్లారిటీ తర్వాతే తేలుతుంది. అయితే తాజాగా మెగా కాంపౌండ్ కి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందనేది తెలియదు కానీ ఆసక్తికరంగా ఉంది. ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు వారసులు రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్, నిహారిక లు ఇప్పటికే హీరో, హీరోయిన్లుగా సినిమా పరిశ్రమకు పరిచయమై బాగానే రాణిస్తున్నారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసులు మాత్రం ఇప్పటివరకు ఎంట్రీ ఇవ్వలేదు. దీంతో పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ఎప్పుడు ఎప్పుడు హీరోగా లాంచ్ అవుతాడా అని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ తన కొడుకు అకీరా నందన్ సినిమా బాధ్యతలను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి అప్పగించినట్లు టాక్. దీంతో రామ్ చరణ్ టాలీవుడ్ లో తనతో సన్నిహితంగా ఉంటున్న ఓ దర్శకుడిని అకీరా కోసం కథను సిద్ధం చేయమని చెప్పాడట. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు ఆ దర్శకుడి కోసం సోషల్ మీడియాలో తెగ ఆరా తీస్తున్నారు. దీంతో దర్శకుడు పూరి జగన్నాథ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.
గతంలో కూడా రామ్ చరణ్ తేజ్ ని చిరుత అనే చిత్రంతో పూరి తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం చేశాడు.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.దీంతో ప్రస్తుతం అకీరా ని కూడా హీరోగా ఎంట్రీ ఇప్పించడానికి పూరిని చెర్రీ సంప్రదించాడట. ప్రస్తుతం తెలుగులో ఫైటర్ అనే చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి నటువంటి చిత్రీకరణ పనులు ముంబై నగరంలోని పరిసర ప్రాంతాల్లో జరిగాయి. లాక్ డౌన్ కారణంగా గ్యాప్ వచ్చింది. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఎటువంటి చిత్రీకరణ పనుల్లో పూరి బిజీబిజీగా ఉన్నాడు. టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ హీరో, బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్నారు.