ఓటిటి ప్లాట్ ఫామ్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సురేష్ బాబు
తాజాగా కరోనా వల్ల నెలకొన్న పరిస్థితుల మూలాన సినిమా రంగానికి కూడా భారీ నష్టం వాటిల్లింది. ఇప్పటికే విడుదలకు సిద్ధంగా అనేక సినిమాలు ఉన్నాయి. అలాగే వాటితో పాటు చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. దీనితో అవన్నీ నేరుగా ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తాయా అంటే దానికి సానుకూలం గానే సమాధానం ఇస్తున్నారు టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఓటిటి ప్లాట్ ఫామ్స్ లోకి సినిమాలు వచ్చేసే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి అని ఎందుకంటే సినిమా ఇప్పటికైనా బయటకు వెళ్లాల్సిందే లోపలే ఉంచుకోలేమని తెలిపారు. అంతే కాకుండా ఇప్పుడున్న సమయంలో నెట్ ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ సంస్థలే బాగా లాభపడ్డాయని అలాగే తనకు తెలిసినంత వరకు అయితే చిన్న మరియు మధ్య తరహా బడ్జెట్ సినిమాలు అంతా ఖచ్చితంగా ఓటిటి కి వెళ్ళిపోతాయని తేల్చి చెప్పేసారు.