Movies

పుష్ప చిత్రం పై వస్తున్న ఆ వార్తలు అన్ని పుకార్లే..!

సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా,పాన్ ఇండియా తరహాలో తెరకెక్కిస్తున్న పుష్ప చిత్రం విషయంలో చాలా వార్తలు వచ్చాయి. అయితే హీరోయిన్ విషయంలో కూడా చాలా వార్తలు వచ్చాయి. రష్మిక మందన్నా తో పాటుగా నివేధా థామస్ కూడా లీడ్ రోల్ లో కనిపించనుంది అని చాలా వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంలో ఆ వార్తలన్నీ పుకార్లేనని తాజా సమాచారం. అయితే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ హీరో గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఒక్క తెలుగు భాషలో మాత్రమే కాకుండా, మిగతా భాషల్లోనూ విడుదల చేస్తున్నారు.

అయితే ఈ చిత్రం హీరోయిన్ విషయంలో పుకార్లకు బ్రేక్ వేసింది చిత్ర యూనిట్. అయితే రంగస్థలం బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ ది పల్లెటూరు కి సంబంధించిన ఒక అమ్మాయి పాత్ర. ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ లు కలిసి పని చేస్తున్న చిత్రం పుష్ప. ఇప్పటికే విడుదల అయిన పుష్ప ఫస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్తం శెట్టి క్రియేషన్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు.