చిరు కూతురు ఈ రంగంలో సక్సెస్ అవుతుందా…చిరు ఒప్పుకున్నాడా…?
సినిమాలతో సమానంగా బుల్లితెరపై క్రేజ్ ఉన్నట్లే , ప్రస్తుతం వెబ్ సిరీస్ కి కూడా క్రేజ్ వచ్చేసింది. బాలీవుడ్ లో ఇప్పటికే పెద్ద పెద్ద స్టార్ హీరోలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ వస్తున్నారు. మన తెలుగు వెబ్ సిరీస్ లలో ఇప్పటికే శ్రీకాంత్ – జగపతిబాబు – సందీప్ కిషన్ – అల్లు శిరీష్ – నవదీప్ లాంటి హీరోలు వెబ్ సిరీస్ లలో నటించారు. తెలుగులోనూ వెబ్ సిరీస్ లకు మంచి క్రేజ్ ఉండడంతో రాబోయే రోజుల్లో వెబ్ కంటెంట్ హవా తప్పదని భావిస్తున్న , పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు డిజిటల్ రంగంలోకి వచ్చాయి. ఇక మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ని రెడీ చేశారు. శరత్ మరార్ – స్వప్న దత్ – క్రిష్ లాంటి వారు కూడా ఓటీటీ డిజిటల్ ప్లాట్ ఫామ్ వైపు వచ్చారు. అంతేకాదు, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా వెబ్ కంటెంట్ వైపు రాబోతున్నాడు. నటీనటులు కూడా వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రస్తుతం కరోనా మహమ్మారితో లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన జనాలు.. సినిమాల కంటే వెబ్ సిరీస్ లను వీక్షించడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తేలింది. దీంతో స్టార్ హీరోలను వెబ్ సిరీస్ లలో నటింపచేసి వాటికి మరింత క్రేజ్ తేవాలని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కృషి చేస్తున్నాయి. అలాగే సమంత – ప్రియమణి – కియారా అద్వానీ లాంటి హీరోయిన్స్ వెబ్ సిరీస్ ల వైపు వచ్చారు. దీంతో గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి ఓ వెబ్ సిరీస్ లో నటించబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం తన కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాలో మెగాస్టార్ నటిస్తు న్నాడు. ఆ తర్వాత మరో ముగ్గురు యంగ్ డైరెక్టర్లతో సినిమాలు ఉంటాయని ఇప్పటికే ఖరారైంది. యంగ్ డైరెక్టర్స్ సుజిత్.. బాబీ.. మెహార్ రమేశ్ లతో సినిమాలు చేయబోతున్న ట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత సాధ్యమైనంత ఫాస్ట్ గా ‘ఆచార్య’ మూవీ కంప్లీట్ చేసి, లూసిఫర్ తెలుగు రీమేక్ ని పట్టాలెక్కించే అవకాశం ఉంది.
అయితే ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక వెబ్ సిరీస్ లో నటించబోతున్నానని కూడా చిరు చెప్పినట్లు వైరల్ అయింది. నిజంగా చిరంజీవి లాంటి టాప్ స్టార్ ఎంట్రీ ఇస్తే తెలుగులోనూ వెబ్ సిరీస్ ల హవా ఏ రేంజ్ కి చేరుతుందో చెప్పక్కర్లేదు. అయితే ఈ వెబ్ సిరీస్ కి ఎవరు డైరెక్షన్ చేయబోతున్నారు అనే ఆసక్తి అందరిలో మొదలైంది మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురైన సుస్మిత ఇప్పటికే మెగా హీరోల సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. అయితే చిరంజీవి నటించబోయే వెబ్ సిరీస్ కి కూడా సుష్మిత దర్శకత్వం చేయబోతున్నారట. తన తండ్రి డిజిటల్ డెబ్యూ కోసం కూతురు డైరెక్టర్ గా మారుతుందని అంటున్నారు. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెలువడున్నాయి.