ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా….ఇప్పుడు ఎక్కడ ఏమి చేస్తుందో తెలుసా ?
ఈమె ఎవరో తెలుసా? తెలుగు సినీ పరిశ్రమలో ఈ పేరు ఎప్పుడైనా వినిపించిందా? ఫోటోలు వీడియోలు కూడా చూసినట్టు గుర్తులేదే అను కుంటున్నారా? ఆమె పేరు లరీసా బొనేసి. సాయి ధరమ్ తేజ్ సరసన తిక్క అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. అదేం సినిమా ఎప్పుడు వినలేదే అనుకుంటున్నారా? 2016 వ సంవత్సరం లో విడుదల అయిన ‘తిక్క’ సినిమా విడుదల అయిన రెండు రోజుల్లో థియేటర్లో నుంచి మాయం అయ్యింది.. అంటే ఎంత ఘోరంగా అపజయాన్ని మూట కట్టుకుందో ఊహించవచ్చు.. సినిమా విడుదల సమయంలో ఒక రేంజ్ లో సినిమా ని విమర్శించారు. ఆ సినిమా ప్లాప్ దెబ్బకు ఆ హీరోయిన్ మళ్లీ తెలుగులో ఇప్పటివరకు కనిపించలేదు. ఇప్పుడు ఆ తిక్క కథ ఓ లుక్ వేసుకుందాము.
సినీ కెరియర్ లో ప్రతి ఒక్క హీరోకి చిన్న పెద్ద తేడా లేకుండా ఎంత కష్ట పడి చేసినప్పటికీ ఒకోసారి శ్రమకు తగ్గ ఫలితాలు రావు. కొన్ని సందర్భాల్లో అవి మరీ చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోతూ ఉంటాయి.ఇంకొన్ని సినిమాలు వెండి తెర మీద ఆకట్టుకోలేక పోయినా బుల్లి తెర మీద విజయాన్ని సాధిస్తూ ఉంటాయి.తమ కెరియర్ లో ఒక మచ్చ లా మిగిలిపోయిన ఆ సినిమాలని మళ్లీ మళ్లీ ఎవరు మాత్రం గుర్తుకు చేసుకుంటారు ? అలాంటి సంఘటనే మన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సినీ కారియర్ లో కూడా ఒకటి ఉంది.
తేజ్ కెరీర్ లో చేదు జ్ఞాపకాలని మిగిల్చిన ‘తిక్క’. సునీల్ కుమార్ రెడ్డి మరియు బీఆర్ దుగ్గినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాని రోహిన్ రెడ్డి నిర్మించారు.ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ నటించిన “సుప్రీమ్” సినిమా కంటే ముందుగా విడుదల అవ్వాల్సి ఉండగా… సినిమా ప్రివ్యూ చూసిన బయ్యర్స్ కొనకుండా వెళ్లిపోయారట. సుప్రీమ్ సినిమా విజయం సాధించిన తరువాత ఈ సినిమా మొత్తానికి విడుదల అయ్యింది. కానీ భారీ అపజయాన్ని మూట కట్టుకుంది..ఇక పోతే ఈ సినిమా టెలికాస్ట్ రైట్స్ ఓ ప్రముఖ ఛానల్ దదక్కించుకుంది. కానీ ఇప్పటివరకు ప్రసారం చేయలేదు.
లాక్ డౌన్ పుణ్యమా అని సీరియల్స్ కి మంగళం పాడిన టీవీ చానెల్స్. వేసిన సినిమాలే మళ్లీ మళ్లీవేస్తున్నారు .మరి అప్పుడు ఎప్ప్పుడో కొన్న సినిమా తాలూకు రైట్స్ ఇప్పుడు గుర్తుకు వచ్చాయేమో మరి తిరిగి ప్రసారం చేస్తున్నారు. అది కూడా వారానికి నాలుగు సార్లు అట. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఏంటి రా ఈ తిక్క సినిమా అంటూ కామెంట్ చేస్తున్నారు. పాపం టీవీ వాళ్ళు కూడా మన సాయి ధరమ్ తేజ్ ని విసిగిస్తున్నట్టు ఉంది కదూ !