Movies

ఎన్టీఆర్‌ 30కి ఆర్‌ఎక్స్‌ 100 కి ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

ఎన్టీఆర్‌ 30వ చిత్రానికి త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించబోతున్న విషయం తెల్సిందే.వీరిద్దరి కాంబోలో వచ్చిన అరవింద సమేత చిత్రం యావరేజ్‌ టాక్‌ దక్కించుకుంది.కాని కలెక్షన్స్‌ విషయంలో మాత్రం నిరాశకు గురి చేసింది.అందుకే ఎన్టీఆర్‌తో ఈసారి బ్లాక్‌ బస్టర్‌ చిత్రం తెరకెక్కించాలని మాటల మాంత్రికుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఈ సినిమాకు అన్ని రకాలుగా బజ్‌ క్రియేట్‌ చేసేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు.అల వైకుంఠపురంలో చిత్రంతో సూపర్‌ హిట్‌ దక్కించుకున్న త్రివిక్రమ్‌ ఆ సినిమాలో కీలక పాత్రకు గాను అక్కినేని హీరో సుశాంత్‌ను నటింపజేసిన విషయం తెల్సిందే.ఆ సినిమాలో హీరోగా నటించిన బన్నీకి తోడుగా సుశాంత్‌ కీలక పాత్రలో నటించి సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాడు. త్రివిక్రమ్‌ గత చిత్రాల్లో కూడా యువ హీరోలు నటిస్తూ వస్తున్నారు.

ఇక ఎన్టీఆర్‌ చిత్రంలో కూడా మరో హీరోను నటింపజేయాలని త్రివిక్రమ్‌ నిర్ణయించుకున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.త్రివిక్రమ్‌ ఈ చిత్రం కోసం ఆర్‌ఎక్స్‌ 100 చిత్ర హీరో కార్తికేయను సంప్రదించాడట.కార్తికేయ హీరోగానే కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, హీరోగా కూడా నటించేందుకు ఆసక్తి చూపుతున్నాడు.

నాని గ్యాంగ్‌లీడర్‌ చిత్రంలో కార్తికేయ విలన్‌గా నటించి మెప్పించాడు.అందుకే ఎన్టీఆర్‌ సినిమాలో కార్తికేయను కీలక పాత్రలో నటింపజేయాలని త్రివిక్రమ్‌ ఫిక్స్‌ అయ్యాడు.అతి త్వరలోనే ఆ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది.వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాను విడుదల చేస్తామంటున్నారు.