Movies

లాక్ డౌన్ వేళ బడా నిర్మాతల ఆలోచనలెలా ఉన్నాయి…కారణం ఏమిటో…?

భారీ ప్రాజెక్ట్స్ నుంచి చిన్న సినిమాల వరకు ఇంట్రెస్టింగ్ తో టాలీవుడ్ లో ప్రస్తుతం సినిమాలను నిర్మిస్తున్న నలుగురు స్టార్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అందులో సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి సురేష్ బాబు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత అక్కినేని నాగార్జున. నిజంగా ఇండస్ట్రీలో అధిక శాతం సినిమాలను వీళ్ళే నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో అన్ని సంస్థలల్లోను సినిమా నిర్మాణం దగ్గర్నుంచి రిలీజ్, డిస్ట్రిబ్యూషన్ వరకు అన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి.

లాక్‌డౌన్ కారణంగా రిలీజ్ అనుకున్న సినిమాల డేట్స్ మొత్తం తారుమారు అయ్యాయి. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఇప్పట్లో జనాలు థియోటర్స్ కి వచ్చే అవకాశాలు కనిపించడం లేదని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. వాస్తవంగా కూడా అదే జరుగుతుందని అందరు భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో మన నిర్మాతల ఆలోచన ధోరణి ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంది. దిల్ రాజు లాక్ డౌన్ ఎత్తేయగానే కొంత గ్యాప్ తీసుకొని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. నెమ్మదిగా జనాలు వస్తారన్న భావనలో ఉన్నారు.

కాని ఈ విషయంలో అల్లు అరవింద్ మాత్రం వేరేలా భావిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులను బట్టి చూస్తే ఈ ప్రభావం వచ్చే సంవత్సరం ప్రథమార్థం వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది కాస్త ప్రాక్టికల్ గా చూస్తే నిజమే అనిపిస్తుంది. రోజు రోజు కి కరోనా ప్రభావం బాగా పడుతుంది. కేసులు కొత్తవి నమోదవుతుండడంతో లాక్ డౌన్ ఎప్పటికప్పుడు పొడగిస్తూనే ఉన్నారు. అంచనా ప్రకారం జూన్ వరకు ఈ లాక్ డౌన్ పొడగించే అవకాశాలున్నాయి. అందుకే అల్లు అరవింద్ చాలా లాజిక్ గా ఆలోచన చేస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత నిర్మాతలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా,ఈ నలుగురు ఒకటిగా అనుకుని వెళ్లే దారి అసలైన దారి అవుతుందేమోనని చెప్పాలి.