Movies

పుష్ప నుండి రంగమ్మత్త ఔటా? కారణం ఇదేనట పాపం

జబర్దస్త్ వల్ల ఫేమ్ అయిన యాంకర్ అనసూయ. బుల్లితెర మీదే కాదు అటు వెండి తెర మీద కూడా అవకాశాలు సంపాదిస్తూ ముందుకి దూసుకెళ్తుంది. ప్రస్తుతం అనసూయ. పవన్ కళ్యాణ్,క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో ముఖ్యపాత్రలో నటించబోతుంది. దాంతో పాటు అల్లు అర్జున్, సుకుమార్ సినిమాలో కూడా అనసూయ పాత్రే కథకు కీలకం అని చెబుతున్నారు.

రంగస్థలం వంటి భారీ విజయం అందుకున్న చిత్రంలో లో ముఖ్య పాత్ర పోషించిన యాంకర్ అనసూయ కి వరుస పెట్టి ఆఫర్లు వస్తున్నాయి.స్టార్ హీరోల సినిమాలో చోటు దక్కించుకుంది అనసూయ. అందులో భాగంగా బాలయ్య-బోయపాటి సినిమాతో పాటుగా చిరంజీవి ఆచార్య సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది అట ఈ జబర్దస్త్ బ్యూటీ.

ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న “పుష్ప” గురించి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో అనసూయకు ఒక ఇంపార్టెంట్ రోల్ వచ్చింది అని ఇండస్ట్రీ లో టాక్.కానీ ఈ సినిమా నుంచి హఠాత్తుగా తీసేసారు అనే వార్త కూడా వైరల్ అవుతుంది. అట ఆమె ప్లేస్ ని నివేత థామస్ తో రీప్లేస్ చేయాల్సింది గా బన్నీ సలహా ఇచ్చాడు అట ..ఇదే నిజం అయితే రంగమ్మ అత్త కి మొదటి సారి భారీ షాక్ తగలక మానదు