త్వరలో జగన్ బయోపిక్…క్లారిటీ ఇచ్చిన యాత్ర సినిమా దర్శకుడు
ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో చాలా వరకు బయోపిక్ లు వచ్చాయి. అయితే యాత్ర చిత్రం తో దర్శకుడు మహి వి రాఘవ వై యస్ ఆర్ ను చాలా బాగా ప్రెసెంట్ చేశారు. అయితే ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా కొనసాగుతున్న జగన్ మోహన్ రెడ్డి బయోపిక్ తీసేందుకు ఈ దర్శకుడు ఆసక్తి చూపుతున్నారు.అంతేకాదు ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తి కర విషయాలు ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించారు. వై యస్ కథని చేయడానికి ఇబ్బంది పడెలేమో కానీ, జగన్ జీవితం గురించి ఎటువంటి ఇబ్బందులూ లేవని అన్నారు.
ముఖ్యమంత్రి జగన్ తన జీవితంలో గాడ్ ఫాదర్ అంత లోతు ఉంటుంది అని మహి వ్యాఖ్యానించారు.అయితే జగన్ లైఫ్ లో హీరోయిజం, కష్టాలు, దరిద్రం, పోరాటం ఇంకా అన్నీ ఉన్నాయి అని తెలిపారు. జగన్ జీవితం ఒక ఎమోషనల్ జర్నీ అవుతుంది అని అన్నారు. అయితే ఈ బయోపిక్ కు జగన్ అన్న దగ్గర నుండి ఓకే అని వస్తె 2022 లో లేదా 2023 లో ఖచ్చితంగా తెరకెక్కిస్తా అని వ్యాఖ్యానించారు.అయితే ఈ సమయంలో వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తా అని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీ సొంతం చేసుకొని ప్రజల పక్షాన నిలబడ్డారు. ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి జగన్ మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై సినిమా చేయాలన్న మహి కోరిక తీరుతుందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.