బెల్లంకొండ శ్రీనివాస్ ఆస్తి ఎన్ని కొట్లో తెలుసా?
నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా టాలీవుడ్ లో హీరోగా అడుగుపెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ గోల్డెన్ లెగ్ అనిపించుకున్నాడు. ఇప్పటివరకూ 10 సినిమాలకు పైనే నటించిన శ్రీనివాస్ తెలుగులో అల్లుడు శ్రీనివాస్ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు.ప్రస్తుతం పెద్దగా హిట్స్ లేని బెల్లంకొండ శ్రీనివాస్ సరైన మూవీ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పటివరకూ నటించిన సినిమాల్లో అగ్ర హీరోయిన్స్ కూడా ఇతడి పక్కన నటించడం విశేషం.
బెల్లంకొండ శ్రీనివాస్ ఆస్తి ఎంత,నెలకు ఎంత సంపాదిస్తున్నాడో వంటి విషయాలకు వెళ్తే, ఇతడి ఆస్తి దాదాపు 250కోట్లు. 15కోట్లు విలువచేసే ఇల్లు,రెండు అధునాతన సౌకర్యాలతో కూడిన కార్లు, మూడు సూపర్ లగ్జరీ బైక్స్ ఉన్నాయి. ఒక్కో సినిమాకు 5కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటాడు.