Movies

ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ చెప్పబోతున్న చిరు.. ఏమై ఉంటుందబ్బా..!

దేశంలో కరోనా కారణంగా సినిమా షూటింగ్‌లు అన్ని ఆగిపోయాయి. అయితే గత ఏడాది సైరా సినిమాతో మంచి సక్సెస్‌ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాని దసరా సందర్భంగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నా కరోనా కారణంగా అది కూడా జరిగేలా కనిపించడం లేదు.

అయితే తాజాగా చిరంజీవి ట్విట్టర్‌లో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. సాధారణంగా మేము పాటలు షూట్ చేసే సమయంలో నేను వాటిని వింటూ ఆనందిస్తానని, కానీ ఇటీవల ఓ పాటను మాత్రం తరచూ పాజ్‌ చేస్తూ మళ్ళీ మొదటి నుంచి వింటూ ఎంజాయ్‌ చేస్తున్నాను. దానికి గల కారణం ఏమిటన్నది రేపు ఉదయం 9 గంటలకు చెబుతానని ట్వీట్ చేశారు. అయితే చిరు ఇచ్చిన క్లూ చూస్తుంటే ఆచార్య సినిమాలోని పాట అయి ఉంటుందని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. ఒక వేళ అదే నిజమైతే ఈ లాక్‌డౌన్ సమయంలో ఫ్యాన్స్‌కి ఇదో పెద్ద గుడ్‌న్యూస్ అనే చెప్పాలి.