Movies

హైపర్ అది చేసిన కామెంట్స్ కి మెగా బ్రదర్ హెచ్చరిక…ఎక్కడకు దారి తీస్తుందో…?

మెగా బ్రదర్ నాగబాబు, హీరో నవదీప్ జడ్జి లుగా వ్యవహరిస్తున్న అదిరింది ప్రోగ్రాం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. దీంతో అందులో స్కిట్స్ కూడా జనాల్లో పాపులర్ అవుతున్నాయి. అటు యూట్యూబ్ లో కూడా మంచి వ్యూస్ సాధిస్తున్నాయి. మొదట 20 ఎపిసోడ్స్ వరకూ మాత్రమే అనుమతి ఉన్నా, ఆ షోకు పెరుగుతున్న ఆదరణ గుర్తించిన జీ తెలుగు యాజమాన్యం 50 ఎపిసోడ్స్ కు అనుమతినిచ్చింది. అంతేకాదు ఈ షోలో గతంలో జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన ఎందరో కంటెస్టెంట్స్ ఇందులో భాగమయ్యారు. వీరిలో చమ్మక్ చంద్ర, ఆర్పీ, ధన్ రాజ్, వేణు లాంటి సీనియర్ ఆర్టస్టులు కూడా ఉన్నారు.

అయితే అదిరింది షోను ఉద్దేశించి హైపర్ ఆది చేసిన కామెంట్స్ ఇప్పుడు బుల్లితెర ఇండస్ట్రీలో దుమారంరేపుతున్నాయి. అదిరింది షోలో ఆర్టిస్టు సద్దాం స్కిట్స్ మంచి ఆదరణ పొందుతున్నాయి. భవిష్యత్తులో మరింత ఆదరణ వస్తుందని నాగబాబు భావిస్తున్నారు. అయితే సద్దాంను హైపర్ ఆదితో పోలుస్తూ నెట్టింట కొన్ని వాదనలు బయలుదేరాయి. దీంతో హైపర్ ఆది ఓ ఇంటర్య్వూలో కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యాడనే వాదన వస్తోంది. తన స్కిట్‌కు వచ్చిన హైయ్యస్ట్ వ్యూస్ 58 మిలియన్ అని, అలాగే 30 మిలియన్ దాటిన స్కిట్స్ రెండు ఉన్నాయని, 20 మిలియన్ దాటిన స్కిట్స్ 5 ఉన్నాయని, 10 మిలియన్ దాటిన స్కిట్స్ 40 ఉన్నాయని ఇవన్నీ ఆల్ టైమ్ రికార్డులు అంటూ గుర్తు చేసాడు.

ఒక సెంచరీ కొట్టేసి తానే సచిన్ టెండూల్కర్‌ను దాటేసామంటే ఎలా.. అలాంటిది ఆయన 100 కొట్టాడు. అందుకే మురిసిపోకూడదు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. కాగా హైపర్ ఆది కూడా చిన్నస్థాయి నుంచి జబర్దస్త్ లో స్టార్ రేంజ్ కు ఎదిగాడు. ప్రస్తుతం తన కన్నా చిన్న ఆర్టిస్టులను ఇలా చులకన చేసి హైపర్ ఆది మాట్లాడటంతో నాగబాబు హర్ట్ అయ్యాడని టాక్. సక్సెస్ తలకు ఎక్కడం మంచిది కాదని, చిన్న స్థాయినుంచి మెగాస్టార్ కు ఎదిగిన చిరంజీవి ఇప్పటికీ, కొత్త స్టార్స్ వస్తే చాలా గౌరవిస్తారని, అలాంటిది హైపర్ ఆది ఇండస్ట్రీలో అడుగుపెట్టి 5 సంవత్సరాలకే తానో పెద్ద స్టార్ అయినట్లు ప్రవర్తించడం తగదని నాగబాబు హెచ్చరించినట్లు టాక్.