Movies

లాక్ డౌన్ సమయంలో సుమ,సుధీర్ కలిసి ఏమి చేస్తున్నారో తెలుసా?

ఇప్పుడు లాక్ డౌన్ కావడంతో బుల్లితెర వీక్షకులకు కొత్త కంటెంట్ కరువయ్యింది. దీనితో స్మాల్ స్క్రీన్ పై ఫేమస్ అయిన నటులు తమ అభిమానులకు కాస్త దూరంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు కొంతమంది మాత్రం తమ ఇళ్లలోనే ఉంటూ తమకు సాధ్యమైన విధంగా ఎంటర్టైన్ చేసేందుకు ప్లాన్స్ వేస్తున్నారు.

అలా ఇటీవలే మన తెలుగు టాప్ యాంకర్ సుమ కనకాల రష్మీ,ప్రదీప్, మరియు అనసూయలతో ఒక ఎంటర్టైనింగ్ ప్రోగ్రాం “సుమక్క సూపర్ 4” ను ప్లాన్ చేసారు.అలాగే ఈటీవీలో ప్రసారం అయ్యే “జబర్దస్త్” ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుల్లో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు.

అయితే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం సుమ ఒక వీడియోను ప్లాన్ చెయ్యగా దాని కోసం సుధీర్ ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అలాగే సుమ గారితో ఏ ప్లాట్ ఫామ్ లో అయినా సరే పని చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సుధీర్ ఒప్పుకున్నట్టు సమాచారం. మరి వీరు ఎలాంటి ప్రాజెక్ట్ ప్లాన్ చేసారో చూడాలి.