Movies

అడవి సింహాలు సినిమా గురించి కొన్ని నమ్మలేని నిజాలు….ఎన్ని కోట్ల లాభమో…?

ఒకప్పుడు మల్టీస్టారర్ మూవీస్ బాగా వచ్చేవి. ఎన్టీఆర్ – ,అక్కినేని: ఎన్టీఆర్ – ,కృష్ణ; అక్కినేని – కృష్ణ; కృష్ణ – శోభన్ బాబు, కృష్ణ – కృష్ణం రాజు ఇలా ఎన్నో కాంబినేషన్స్ అదిరిపోయేవి. ఓ పక్క దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు,మరోపక్క దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు డైరెక్షన్ లోనే కాదు మిగిలిన డైరెక్టర్స్ కూడా మల్టీస్టారర్స్ తీశారు. ఇక తెలుగు ఇండస్ట్రీలో దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు, సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్‌లో కాంబినేషన్‌లో 8 చిత్రాలు తెరకెక్కాయి. అన్నీ హిట్ అయ్యాయి. కృష్ణ, కే.రాఘవేంద్రరావు అశ్వనీదత్ కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘అడవి సింహాలు’ మూవీలో రెబెల్ స్టార్ కృష్ణంరాజు కూడా నటించారు.

టాలీవుడ్ లో ‘అడవి సింహాలు’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రం సరిగ్గా 37 ఏళ్ల క్రితం 1983 ఏప్రిల్ 28 న విడుదలైంది. కృష్ణ, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన 4వ చిత్రం కూడా. ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా జయప్రద, శ్రీదేవి హీరోయిన్స్‌గా నటించారు. అయితే టాలీవుడ్ లో కృష్ణ – జయప్రద కాంబినేషన్ కి మంచి ఇమేజ్ ఉండేది. వీళ్లిద్దరు జోడిగా చాలా సినిమాలు వచ్చాయి. అయితే అడవి సింహాలు మూవీలో మాత్రం కృష్ణకు చెల్లెలుగా జయప్రద నటించడం విశేషం. వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో భారీ ఎత్తున తెరకెక్కించిన ఈ మూవీలో కృష్ణరాజు కి జోడిగా జయప్రద నటించగా, కృష్ణకు జంటగా శ్రీదేవి నటించింది.

గుర్రాలపై కృష్ణ,కృష్ణం రాజు స్వారీ చేయడం,పాటలు,ఫైట్స్ ఇలా అన్నీ ఆకట్టుకున్నాయి. మల్టీస్టారర్ మూవీ కావడంతో ఇద్దరు హీరోల ఫాన్స్ కూడా రిలీజ్ రోజున భారీ సందడి చేసారు. భారీ కటౌట్స్ పెట్టి ,పూలమాలలతో అలంకరించి హడావిడి చేసారు. అడవి సింహాలు చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్నే నమోదు చేసింది. అడవి సింహాలు చిత్రాన్ని హిందీలో జితేంద్ర, ధర్మేంద్ర హీరోలుగా ‘జానీ దోస్తీ’ పేరుతో తెరకెక్కింది. తెలుగులో కృష్ణ,కృష్ణంరాజు నటించిన పాత్రల్లో జితేంద్ర,ధర్మేంద్ర నటించారు. హిందీలోశ్రీదేవి పాత్రలో శ్రీదేవి నటించింది. జయప్రద పాత్రలో పర్వీన్ బాబీ నటించింది. అక్కడ కూడా రాఘవేంద్రరావు డైరెక్షన్ చేశారు. అయితే తెలుగు కన్నా హిందీలో ఇంకా బాగా హిట్ అయింది.