ఎన్టీఆర్ చరణ్ స్నేహం పై షాకింగ్ కామెంట్స్ చేసిన చిరంజీవి
నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్,కొణిదల మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్,రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నారు.తెలుగు లో అసలు సిసలు మల్టీస్టారర్ మూవీగా ఇది రూపొందుతుంది.మొట్టమొదటిసారిగా ఇద్దరు బడా హీరోలు కలిసి నటిస్తుండటంతో మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మన హీరోలు ఇప్పుడిప్పుడే మారుతున్నారు కథ డిమాండ్ ని బట్టి ఒకే సినిమాలో కలిసి నటించడానికి వెనకాడటం లేదు,అంతేకాకుండా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఇద్దరు చాలా మంచి స్నేహితులు వాళ్ళ స్నేహం చూస్తుంటే నాకు ఈర్ష కలుగుతుంది.
అని చెప్తూ వీరిద్దరి స్నేహం బంధాన్ని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను అన్నారు.బాహుబలి,ఈగ సినిమాలతో పాటు ఇంతకు ముందే మగధీర వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు.అంతేకాకుండా హీరో సెంట్రిక్ గా ఉన్న సినిమాల్ని డైరెక్టర్ సెంట్రిక్ గా మార్చగల కెపాసిటీ రాజమౌళికి ఉందని చిరంజీవి రాజమౌళి ని కొనియాడారు.ప్రేక్షకులు మాదిరిగానే నేను కూడా ఆర్.ఆర్.ఆర్ సినిమా కోసమే ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాను అని చెప్పారు.