Movies

ఆ సినిమా చేసి తప్పు చేశా అంటున్న రాశి ఖన్నా…ఆ సినిమా ఇదే.. !

టాలీవుడ్ అందాల బ్యూటీ రాశి ఖన్నా గతకొంత కాలంగా చేస్తున్న ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీలుగా నిలుస్తున్నాయి.ఇక ఈ బ్యూటీ నటించిన రీసెంట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్ ఆమెకు చాలా ప్రత్యేకమైనది అన్నట్లుగా సినిమా రిలీజ్ సమయంలో చెప్పుకొచ్చింది.

ఈ సినిమాలో రాశి ఖన్నా పాత్రకంటే కూడా ఈ సినిమాలో ఆమె చేసిన బోల్డ్ సీన్స్ కోసమే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లారు.కానీ ఇప్పుడు అవే బోల్డ్ సీన్స్ ఆమెకు అవకాశాలు లేకుండా చేశాయని, ఆ సినిమాలో అలా నటించడమే పెద్ద తప్పని ఆమె అంటోంది.

వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నటించిన రాశి ఖన్నా బోల్డ్ సీన్స్ చేయడం వల్ల తన తల్లిదండ్రులు బాధపడ్డారని ఆమె చెప్పుకొచ్చింది.ఇకపై అలాంటి పాత్రలు చేయబోనని కుండ బద్దలు కొట్టింది.

ఆ సినిమాలో చేసిన పాత్ర తనకు మంచి పేరు తీసుకురావడంతో పాటు సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని ఆమె ఆశించింది.కానీ ఆ రెండూ కూడా జరగలేదు.సినిమా బాక్సాఫీస్ వద్ద నెగెటివ్ రిజల్ట్‌ను మూటగట్టుకుంది.మొత్తానికి ఒక్క సినిమాలో చేసిన పాత్ర రాశి ఖన్నాకు బాగానే కనువిప్పు చేసిందని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.మరి ఇప్పటికైనా రాశిఖన్నాకు మంచి పాత్రలు దక్కుతాయో లేదో చూడాలి.