మాటల మాంత్రికుడు,మెగాస్టార్ మధ్య తేడా రావటానికి కారణం ఎవరో తెలుసా?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ , మెగాస్టార్ చిరంజీవి చాలా రోజులుగా సినిమా చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే, త్రివిక్రమ్‌తో సినిమా ఉంటుందని గతంలో చిరు కన్ఫర్మ్ చేసాడు. మరి ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే వేరేలా ఉందన్న మాట వినిపిస్తోంది. అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన త్రివిక్రమ్ తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి తో ఉంటుందో లేదో తెలీదు. పైగా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు.
కొరటాల శివతో ఆచార్య సినిమా చేస్తూనే రాబోయే ఐదు సినిమాలు కూడా కుర్ర దర్శకులకు ఛాన్స్ ఇస్తూ డిసైడ్ అయిపోయాడు. అందులో నెక్ట్స్ లైన్లో సుజీత్, బాబీ, హరీష్ శంకర్ లాంటి దర్శకులు కూడా ఉన్నారు. దీంతో మరో మూడు నాలుగేళ్ల వరకు కూడా చిరంజీవి డైరీ అసలు ఖాళీ లేదు.ముఖ్యంగా ఆచార్య తర్వాత లూసీఫర్ రీమేక్ కోసం సుజీత్‌ను చిరంజీవి ఎంచుకున్నాడు. ఆ తర్వాత బాబీతో పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక మెహర్ రమేష్ కూడా కథ చెప్పాడని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ఆచార్య తర్వాత మరో మూడేళ్ళ వరకు చిరంజీవి ఖాళీగా ఉండడు.
అయితే అప్పట్లో రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమా వేడుకలో మాట్లాడుతూ తాను త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయబోతున్నానని అనౌన్స్ చేసిన చిరంజీవి ఆ మూవీకి దానయ్య నిర్మాత అని కూడా చెప్పాడు. కానీ మొన్న చిరు చెప్పిన దర్శకుల లిస్టులో త్రివిక్రమ్ పేరు లేదు. కనీసం ముగ్గురు నలుగురు దర్శకుల లిస్టులో కూడా త్రివిక్రమ్ పేరు కనిపించలేదు. సుజీత్, బాబీ కన్ఫర్మ్ అయ్యాయి. మెహర్ రమేష్, హరీష్ శంకర్, పరశురామ్ లాంటి వాళ్లు కథలు చెప్పారని అన్నాడే గానీ, అందులో త్రివిక్రమ్ పేరు ఎనౌన్స్ చేయలేదు. మరిచిపోయాడా ఒకవేళ త్రివిక్రమ్ తో తేడా కొట్టిందా అనేది అర్థం కావడం లేదు.