త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా చేయటం లేదట …. కారణం ఆ స్టార్ హీరోనా…!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన పంచ్ డైలాగులతోనే కాదు దర్సకత్వంలో కూడా దూసుకుపోతున్నాడు. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఈ సంక్రాంతికి మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తెలుగులో మంచి కలెక్షన్లు రాబట్టి, బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్, ఎన్టీఆర్ హీరోగా నెక్ట్స్ మూవీ ప్లాన్ చేసి,ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ పేరుతో ఓ సినిమా కూడా అనౌన్స్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా స్కిప్ట్ వర్క్ జరుగుతోంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో ‘అరవింద సమేత వీర రాఘవ మూవీ వచ్చింది.
అందుకే ఎన్టీఆర్ ,త్రివిక్రమ్ కాంబినేషన అనగానే ఇండస్ట్రీలో మంచి టాక్ వచ్చింది. ఈ తాజా సినిమా కొంత పొలిటికల్ టచ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ పెట్టనున్నట్లు కూడా టాక్ నడిచింది. హారికా హాసిని క్రియేషన్స్ చినబాబుతో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో కళ్యా ణ్ రామ్ ఈ మూవీ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్ర హీరో సంజయ్ దత్ విలన్‌గా యాక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడటని టాక్.అయితే కానీ ప్రస్తుతం కరోనా కారణంగా అన్ని సినిమాలకు సంబంధించిన షూటింగ్స్‌తో పాటు ఆర్ఆర్ఆర్ షూటింగ్ వాయిదా పడింది. ఇక రిలీజ్ డేట్ ఇప్పటికే ఈ యేడాది జూలై 31 నుంచి 2021 జనవరి 8కి వాయిదా పడింది. ఈ డేట్‌కు ఈ సినిమా వస్తుందో రాదో కూడా ఇప్పట్లో చెప్పడం కష్టం. అది అయ్యాక గానీ త్రివిక్రమ్ తో మూవీ ఉండదు.
ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్, శృతి హాసన్‌ను హీరోయిన్స్‌గా అనుకుంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ను త్రివిక్రమ్ పూర్తి చేసి తారక్‌కు మొత్తం పంపించాడు. ఒకవేళ రషెస్ చూసుకున్నాకా.. ఏదైనా తేడా కొడితే.. మళ్లీ రీ షూట్‌కు వెళ్లాలి. ఎంత లేదన్నా దీనికి మరింత సమయం పడుతుంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాను బాహుబలి రిలీజ్ చేసిన ఏప్రిల్ 28న విడుదల చేయాలనే ప్లాన్‌లో రాజమౌళి ఉన్నారు. ఈ లోగా త్రివిక్రమ్ ఓ మాదిరి బడ్జెట్‌లో ‘అ..ఆ’ సినిమా మాదిరి ఒకటి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇందుకోసం నాగ చైతన్య, నాని పేర్లు వినిపిస్తున్నా, నాగ చైతన్యతో చేసే ఛాన్స్ ఎక్కువగా ఉందట. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.