Movies

అనసూయ ఫెవరెట్ హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఈటీవీలో ఫుల్ జోష్ తో నడిచే జబర్దస్త్ కామెడీ షో తో పాపులర్ గా మారిన యాంకర్ అనసూయ ఒకవైపు సినిమాలు, మరోవైపు టీవీ షోలతో ఫుల్‌ బిజీగా దూసుకెళ్తోంది. అందం,అభినయం మేళవించి చేసే అనసూయ యాంకరింగ్ గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు చెప్పక్కర్లేదు. ఎక్కువ గా టీవీ షోలతోనే పాపులర్ అయిన ఈ భామ కెరీర్ ఆరంభం నుంచి చేసిన సినిమాలు తక్కువే అయినా, గుర్తింపు ఎక్కువగానే తెచ్చేసుకుంది. పలు టివి షోలతో తన సత్తా చాటుతోంది.

ఇక ‘క్షణం’, ‘రంగస్థలం’లో అనసూయ చేసిన పాత్రలకు మంచి మార్కులే పడ్డాయి. గత ఏడాది ‘కథనం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనసూయ కు ప్రేక్షకుల ను తన నటనతో రక్తి కట్టించి ఆశ్చర్యపరిచింది. తాజాగా లాక్‌డౌన్ సందర్భంగా అభిమానులతో చిట్‌చాట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె ఫేవరేట్ హీరో ఎవరనే దానిపై అడిగిన ప్రశ్నకు ఈ భామ తన స్టైల్లో సమాధానమిచ్చి షాకిచ్చింది.

అప్పట్లో అనసూయకు యాక్షన్ కింగ్ అర్జున్ అంటే చాలా ఇష్టం ఉండేదట. పైగా అప్పట్లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘జెంటిల్‌మెన్’ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అయింది. ఈ సినిమాతో అర్జున్ అభిమానిగా మారిపోయిందట. ప్రస్తుతం కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తాండ’లో ఈ భామ నటిస్తోంది. ఇందులో అనసూయ స్పైసీ రోల్ చేస్తోందట.