Movies

సమంత ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా రాకపోవటానికి కారణం ఏమిటో తెలుసా?

టాలీవుడ్ లో డార్లింగ్ సరసన నటించడానికి హీరోయిన్స్ ఛాన్స్ కొరకు ఎదురుచూస్తుంటారు అని వేరే చెప్పననవసరం లేదు.ఏదో ఒక సినిమా ద్వారా డార్లింగ్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేయాలని అనుకుంటూ ఉంటారు .హీరోల తో అందరితోనూ సన్నిహితంగా ఉండే డార్లింగ్…ఇటు హీరోయిన్లు తో కూడా అలాగే సన్నిహితంగా ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ని మైంటైన్ చేస్తుంటారు. అనుష్క, త్రిష, నయనతార, శ్రియ వంటి అగ్రహీరోయిన్లు అందరితో జతకట్టారు ప్రభాస్. కానీ ఒక్క హీరోయిన్ గురించి మాత్రం కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తుంది.తనతో నటించబోయే హీరోయిన్ల విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అంట ప్రభాస్.

ఇంత వరకు ఏ ఒక్క హీరోయిన్ విషయంలో తనకి విబేధాలు రాలేదని చెబుతుంటారు.కానీ అగ్ర హీరోయిన్ సమంతాతో ఒక్కసారి కూడా నటించే అవకాశం రాలేదు అని చెప్పారంట ప్రభాస్ .సమంతా మరియు ప్రభాస్ మధ్య ఉన్న హైట్ డిఫరెన్స్ వల్లే ఆమెతో ఇప్పటివరకు ప్రభాస్ సినిమా చేయలేదు అని ఓ వార్త హల్చల్ చేస్తుంది. సాహోలో మొదటగా హీరోయిన్ గా సమంతానే అనుకున్నారు అంట. కానీ చివరికి శ్రద్ధ కపూర్ ని ఫైనల్ చేసారు. ప్రభాస్ తదుపరి చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ వార్తపై తెలుగు సినీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సమంతా మరీ అంత పొట్టిగా ఏం ఉండదు. ఇండస్ట్రీ లో పవన్,మహేష్ లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే.కానీ సమంతతో ఇంకో సమస్య ఉందని అందుకే ఇలాంటి సాకులు చూపెడుతున్నారని సామ్ ఫాన్స్ మండిపడుతున్నారు.