వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా వర్మ సెన్సేషనల్ సినిమా..!
మన టాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏ సినిమా తీసిన అది సంచలనమే అని చెప్పాలి. ఎందుకంటే అతను ఎంచుకునే సబ్జెక్టులు ఆ రేంజ్ లో ఉంటాయి మరి. సినిమా హిట్టవ్వని ప్లాప్ అవ్వనీ విడుదలకు ముందు మాత్రం తన సినిమాకు కావాల్సినంత హైప్ ను ఏదొకలా తెచ్చుకుంటారు. అలాంటి ఓ సినిమాయే ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ కానుంది.
వంగవీటి మోహన రంగ జీవిత చరిత్రపై సందీప్ మాధవ్ హీరోగా తీసిన ఈ చిత్రం అప్పట్లో పెను దుమారమే రేపింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని స్టార్ మా వారు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చేసేందుకు ప్లాన్ చేసారు. వచ్చే ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ చిత్రాన్ని టెలికాస్ట్ చెయ్యనున్నట్టుగా వారు తెలిపారు. మరి ఈ చిత్రం స్మాల్ స్క్రీన్ పై పెర్ఫామ్ చేస్తుందో చూడాలి.