Movies

ఇర్ఫాన్ ఖాన్ ఆస్తి విలువ తెలిస్తే షాకవుతారు

బాలీవుడ్ సినిమాపై చెరగని ముద్ర వేసిన బాలీవుడ్ దిగ్గజ నటుడు ఇర్ఫాన్ ఖాన్ చిన్న వయసులోనే ఈలోకం నుంచి వెళ్లిపోయాడు. ఇంకా ఎన్నో సంచలన పాత్రలు ఆయన కోసం ఎదురుచూస్తున్నాయి. ఎన్నో విలక్షణమైన రోల్స్ ఆయనే కావాలంటూ కోరుతున్నాడు. ఇలాంటి సమయంలో ఈయన మరణం అంత తేలిగ్గా అభిమానులు మరిచిపోలేకపోతున్నారు. ఎందుకంటే, ప్రపంచ సినిమాపై ఆయన తనదైన ముద్ర వేసాడు. ఆయనకు భార్య సుతాప సిక్కర్, ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాళ్ల పేర్లు బాబిల్, అయాన్. త్వరలోనే ఇర్ఫాన్ లేని లోటు ఆయన కొడుకు బాబిల్ ఖాన్ రూపంలో తీరుతుందని బాలీవుడ్ పెద్దల మాట. ఇర్ఫాన్ మరణం తర్వాత ఆయన ఆస్తులు లెక్కలు కూడా బయటికి వస్తున్నాయి.

నిజానికి గత పదేళ్లుగా ఇర్ఫాన్ కెరీర్ పీక్స్‌లో ఉంది. అచ్చంగా ఇక్కడ మనకు శ్రీహరి ఎలాగైతే పీక్స్‌లో ఉన్నపుడు మరణించాడో.. అలాగే ఇర్ఫాన్ కూడా అక్కడ కన్నుమూశాడు. ఇర్ఫాన్ సినిమాకు 5 నుంచి 7 కోట్ల వరకు తీసుకునేవాడు. హీరోగా నటిస్తే 8 కోట్ల వరకు కూడా తీసుకున్న సందర్భాలున్నాయి. యాడ్స్‌కు కూడా కోటి వరకు ఛార్జ్ చేసేసాడు. అవి కాకుండా ఇతర వ్యాపారాల్లో కూడా దాదాపు 25 కోట్ల వరకు ఆయన ఇన్వెస్ట్ చేసినట్లు టాక్.

ఇక నికరంగా చూసుకుంటే ఇర్ఫాన్ ఖాన్‌కు 80 నుంచి 100 కోట్ల వరకు ఆస్తులున్నట్లు తెలుస్తుంది. దాంతో పాటు ముంబైలో 15 కోట్లు విలువ చేసే ఇళ్ళు.. అందులో అత్యంత ఖరీదైన ఇంటీరియర్ కూడా ఉన్నాయి. కార్లపై ఎప్పుడూ ఇర్ఫాన్ ఖాన్‌కు పెద్దగా మోజు ఉండేది కాదు.ఇప్పటికీ ఆయన 10 లక్షల టొయోటోను వాడుతున్నాడు. ఆయన దగ్గరున్న ఒకేఒక్క కార్ ఇది ఒక్కటే అంటే ఆశ్చర్యపోక తప్పదు. అన్నీ కలిపితే ఇర్ఫాన్ ఖాన్‌కు దాదాపు 150 కోట్ల వరకు ఆస్తులున్నట్లు లెక్కతేలుతున్నాయి.