సీఎం కేసీఆర్ మరొక కీలక నిర్ణయం – వాహనాల యజమానులకు శుభవార్త…
తెలంగాణ రాష్ట్రంలో మహమ్మారీ కరోనా వైరస్ దారుణంగా పెరుగుతున్న తరుణంలో, ఈ వైరస్ నివారణకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ, రాష్ట్రంలో లాక్ డౌన్ ని చాలా ఖఠినంగా అమలు చేస్తున్నాయి. కాగా ఈ లాక్ డౌన్ కారణంగా చాలా మంది ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. కాగా ఈ తరుణంలో ప్రైవేటు రవాణా, కార్గో సర్వీసుల యజమానులకు తెలంగాణ ప్రభుత్వం కాస్త ఊరటనిచ్చింది. కాగా వారందరికి కూడా తొలి త్రైమాసిక మోటారు వాహన పన్ను చెల్లించడానికి మరొక నెల నెల రోజుల గడువు ఇస్తూ, తెలంగాణ ప్రభుత్వం సంబంధిత ఉత్తర్వులను జారీ చేసింది.
కాగా తెలంగాణ రాష్ట్రంలో బస్సులు, లారీలు, కార్లు, ఆటోలు సంబంధిత వాణిజ్య వాహనాలు దాదాపు 4 లక్షల వరకు ఉండగా, ఆ వాహనాల యజమానులు అందరు కూడా ప్రతి మూడు నెలలకోసారి మోటార్ వెహికల్ టాక్స్‌ను చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 30 లోపే టాక్స్ చెల్లించాల్సి ఉండగా, ఆ గడువును పెంచుతూ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. కాగా గత కొద్దీ రోజులుగా రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా వాహనాలు అన్ని కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయి తీవ్రమైన నష్టాల్లో ఉన్నామని, అందుకు గాను వాహనాల పన్ను చెల్లించడానికి తమకు కొంత సమయాన్ని ఇవ్వాల్సిందిగా తెలంగాణ లారీ యజమానుల సంఘం, క్యాబ్స్ యజమానుల అసోసియేషన్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కీలకమైన నిర్ణయాన్ని తీసుకుందని సమాచారం.