Movies

ప్రపంచ రికార్డు నెలకొల్పిన రామాయణం.!

మన దేశపు ఇతిహాసాలు కానీ పురాణాలు కానీ చాలా అమోఘంగా ఉంటాయి. మహా భారతం , రామాయణం వంటి చరిత్రకు పరదేశియులు సైతం మంత్రముగ్ధులు అవుతారు. ఎక్కడ వరకో ఎందుకు వీటిలో ఉన్న చాలా అంశాలే ఎన్నో భారీ హాలీవుడ్ సినిమాలకు ప్రేరణగా నిలిచాయి.అంత గొప్ప చరిత్ర మన భారతావళిది. అలాంటి ఏ భారతం మరియు రామాయణాలను కళ్ళకి కట్టినట్టుగా చూపిన ఎన్నో సినిమాలు ఉన్నాయి. ధారావాహికలు ఉన్నాయి.

అలా 1980వ దశకంలోనే తీసిన రామాయణం ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా మళ్ళీ ప్రేక్షకుల కోరిక మేరకు దూరదర్శన్ ఇండియా ఛానెల్ వారు మరోసారి టెలికాస్ట్ చెయ్యగా దీనిని రికార్డు స్థాయి వ్యూవర్స్ వచ్చినట్టుగా వారు తెలిపారు.గత ఏప్రిల్ 16 నుంచి టెలికాస్ట్ మొదలు పెట్టిన మెగా సీరియల్ ను ఇప్పటి వరకు 7 కోట్ల 70 లక్షల మందికి పైగా వీక్షించినట్టుగా డిడి ఛానెల్ వారు నిర్ధారించారు. అలాగే ఇది కేవలం ఒక్క మనదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యధికంగా వీక్షించిన ధారావాహికగా రికార్డు నెలకొల్పినట్టుగా వారు వెల్లడించారు.